Madan Lokur: ఐరాస అంతర్గత న్యాయమండలి చైర్‌పర్సన్‌గా జస్టిస్ మదన్ లోకుర్
ఆయన ఈ పదవిలో 2028 నవంబర్ 12 వరకు కొనసాగనున్నారు. ఈ నియామకం గురించి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ఒక లేఖ ద్వారా తెలియజేశారు.
అలాగే ఈ అంతర్గత న్యాయ మండలి సభ్యులుగా కార్మెన్ ఆర్టిగాస్ (ఉరుగ్వే), రోసాలీ బాల్కిన్ (ఆస్ట్రేలియా), స్టెఫాన్ బ్రెజీనా (ఆస్ట్రియా), జే పొజెనెల్ (అమెరికా) తదితరులు నియమితులయ్యారు.
జస్టిస్ లోకూర్.. 1953లో జన్మించారు. ఈయన జూన్ 4, 2012న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై డిసెంబరు 30, 2018న పదవీ విరమణ చేశారు. లోకూర్.. ఫిజీ సుప్రీంకోర్టుకు 2019లో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అక్కడ నాన్-రెసిడెంట్ ప్యానెల్‌లో ఆయన పనిచేశారు. ఆయన విదేశానికి చెందిన సుప్రీంకోర్టులో జడ్జిగా నియమితులైన తొలి భారతీయ న్యాయమూర్తి. ఈ అంగీకారంతో.. ఆయన ఐక్యరాజ్యసమితి అంతర్గత న్యాయ మండలి చైర్‌పర్సన్‌గా కౌన్సిల్‌కు నాయకత్వం వహించనున్నారు.