PM Modi: స్వల్పకాలంలో రికార్డు స్థాయిలో ఉద్యోగాలు కల్పించిన ప్రధాని మోదీ
రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో భాగంగా మరో 71 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందించిన సందర్భంగా వర్చువల్‌గా డిసెంబర్ 23వ తేదీ ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు.
ప్రధాని మాట్లాడుతూ.. యువతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, ప్రభుత్వ పాలసీలు, కార్యక్రమాలు, పథకాల్లో వారికి పెద్దపీట వేశారని తెలిపారు. యువత సాధికారత పెంపొందించడంపై పత్రాలను జారీ చేసిన రోజ్‌గార్ మేళా కార్యక్రమం పలు సామర్థ్యాలను వెలికితీస్తున్నదని ఆయన చెప్పారు.
మరో ముఖ్యమైన అంశం, ప్రభుత్వ ఉద్యోగాలను పొందిన వారిలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉన్నందుకు ఆయన ఆనందం వ్యక్తం చేశారు. మహిళా సాధికారత మరింత పటిష్టంగా సాకారమవుతున్నదని, 26 వారాల ప్రసూతి సెలవులు మహిళల కెరీర్‌కు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని వెల్లడించారు.
River Linking Project: ఈ రాష్ట్రంలోని.. 11 నదుల అనుసంధానానికి రూ.40 వేల కోట్లు
ఇతర విభాగాల్లో కూడా యువతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పిన ప్రధాని స్టార్ట్‌ప్ ఇండియా, డిజిటల్ ఇండియా, అంతరిక్ష, రక్షణ రంగం వంటి రంగాల్లో యువత దృష్టిని పెంచినట్లు తెలిపారు.
విద్యాభ్యాసంలో కూడా ప్రభుత్వ చర్యలు తీసుకున్నాయనీ, నూతన జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టడం, విద్యాభ్యాసం మాతృభాషలో చేయడం ద్వారా మెరుగైన విద్యాసముపార్జన సాధ్యమవుతుందని చెప్పారు.
ఇటువంటి సవాళ్లలో.. 13 భారతీయ భాషలలో ప్రవేశ, పోటీ పరీక్షలు నిర్వహించడం ద్వారా భాష అడ్డంకులు తొలగించి, మరింత పారదర్శకంగా విధానం కొనసాగించాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
PM Modi: ప్రయాగరాజ్ మహా కుంభమేళా.. రూ.5,050 కోట్ల ప్రాజెక్టు ప్రారంభం