Zika Virus: నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం రేపింది.
మర్రిపాడు మండలం వెంకటాపురానికి చెందిన బత్తుల నాగరాజు, కళ్యాణి దంపతుల ఐదేళ్ల కుమారుడు సుబ్బరాయుడు జ్వరం, తలనొప్పితో సుమారు 20 రోజులుగా బాధపడుతున్నాడు. మొదట్లో స్థానికంగా వైద్యం చేయించినా తగ్గలేదు.
దీంతో 10 రోజుల కిందట నెల్లూరులోని నారాయణ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షించి మందులు రాసి ఇంటికి పంపారు. అయినా తగ్గకపోవడంతో మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
దీంతో వైద్యులు థర్డ్ పార్టీ ల్యాబ్ సహకారంతో ముంబైలోని ప్రైవేటు ల్యాబ్‌కు రక్త నమూనాలు పంపారు. అక్కడ జికా వైరస్ అని తేలింది. దీంతో బాలుడిని మెరుగైన చికిత్స కోసం చెన్నై ఎగ్మోర్‌లోని బేబీ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
Mpox Virus: భారత్‌లో నమోదైన ఎంపాక్స్ క్లేడ్ 1బీ తొలి కేసు!
Published date : 19 Dec 2024 12:55PM