Skip to main content

National Testing Agency: ఉన్నత విద్య ప్రవేశ పరీక్షలకే ఎన్‌టీఏ పరిమితం

2025 నుంచి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ)ని ఉద్యోగ ఎంపిక పరీక్షల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు.
NTA to focus only on entrance exams for higher education

ఇకపై ఎన్‌టీఏ కేవలం ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షలే నిర్వహించనుంది. ఈ నిర్ణయం ప్రకారం ఎన్‌టీఏని 2024లో పునర్వ్యవస్థీకరించి, అవసరమైన కొత్త పోస్టులను సృష్టించాలని మంత్రి చెప్పారు.

అంతేకాకుండా.. మంత్రి నేషనల్ ఎలిజిబిలిటీ కోమ్ఫ్రెహెన్స్ టెస్ట్(నీట్)ని ప్రస్తుతం ఉన్న పెన్-పేపర్ విధానం బదులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్షగా (సీబీటీ) నిర్వహించేందుకు ఆరోగ్య శాఖతో సంబంధిత చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.

వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం.. నిర్వహించే నీట్ సహా పలు పరీక్షల లీకేజీలు, రద్దులు వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని, ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇచ్చిన సిఫారసుల ఆధారంగా పునర్వ్యవస్థీకరణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (క్యూయెట్-యూజీ)ను ఇకపై సంవత్సరానికి ఒకే పర్యాయం నిర్వహించాలని మంత్రులు వెల్లడించారు.

Kendriya, Navodaya Vidyalayas: దేశంలో కొత్తగా 85 కేంద్రీయ, 28 నవోదయ విద్యాలయాలు.. తెలుగు రాష్ట్రాల్లో..

ఇస్రో మాజీ చీఫ్ ఆర్.రాధాకృష్ణన్ సారథ్యంలో ఏర్పడిన కమిటీ డిజి-యాత్ర మాదిరిగా డిజి-ఎగ్జామ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని సిఫారసు చేసింది.  ఇందుకోసం.. ఆధార్, బయో మెట్రిక్‌తోపాటు ఏఐ ఆధారిత డేటా అనలిటిక్స్‌ను వినియోగించుకోవాలని సూచించింది. పరీక్షల నిర్వహణ, భద్రత, నిఘా, సాంకేతికత వంటి అంశాలకు సంబంధించి డైరెక్టర్‌ స్థాయిలో 10 సిఫారసులను చేసింది.

ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య పుస్తకాల ధర తగ్గింపు
2025 నుంచి ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య పుస్తకాల ధరలను తగ్గించనున్నట్లు మంత్రి ప్రధాన్‌ వివరించారు. ప్రస్తుతం ఏడాదికి 5 కోట్ల టెక్ట్స్‌ బుక్స్‌ను మాత్రమే ప్రచురిస్తున్నారన్నారు. 2025 నుంచి ముద్రణ సామర్థ్యాన్ని 15 కోట్లకు పెంచుతామని, నాణ్యమైన పుస్తకాలను అందిస్తామని ప్రక టించారు. పాఠ్య పుస్తకాల ధరలను పెంచి, విద్యా ర్థుల తల్లిదండ్రులపై భారం పెంచబోమన్నారు. మారిన సిలబస్‌ ప్రకారం 2026–27 నుంచి 9 నుంచి 12వ తరగతి వరకు కొత్త పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తెస్తామని మంత్రి వెల్లడించారు.

Draupadi Murmu: విశ్వబంధు భారత్‌కు రాజ్యాంగమే పునాది.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

Published date : 18 Dec 2024 05:59PM

Photo Stories