Kendriya, Navodaya Vidyalayas: దేశంలో కొత్తగా 85 కేంద్రీయ, 28 నవోదయ విద్యాలయాలు
అలాగే ఒక కేంద్రీయ విద్యాలయ విస్తరణకు అంగీకారం తెలిపింది. మంత్రివర్గం డిసెంబర్ 6వ తేదీ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైంది. పలు నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గం నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలియజేశారు.
కొత్తగా ఏర్పాటు కానున్న కేంద్రీయ విద్యాసంస్థలతో 82 వేల మందికిపైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని, వారికి నాణ్యమైన విద్య అందుతుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం 1,256 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. ఇందులో ఒకటి మాస్కోలో, మరొకటి ఖాట్మాండులో, ఇంకోటి టెహ్రాన్‌లో ఉన్నాయి. ఢిల్లీ మెట్రో నాలుగో దశలో భాగంగా 26.46 కిలోమీటర్ల పొడవైన రిథాలా–కుండ్లీ మార్గానికి సైతం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Sakhi Depot: దేశంలోనే తొలి మహిళా బస్ డిపో ప్రారంభం.. ఎక్కడంటే..
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణలో ఏడు నవోదయ విద్యాలయాలు ఏర్పాటుకానున్నాయి. తెలంగాణలో ఇప్పటికే తొమ్మిది నవోదయ విద్యాలయాలున్నాయి.
ఏపీలో.. అనకాపల్లి, వలసపల్లి, పాల సముద్రం, తాళ్లపల్లి నందిగామ, రొంపిచర్ల, నూజివీడు, డోన్‌లలో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.
తెలంగాణలో.. జగిత్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, మేడ్చల్, మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, సూర్యాపేటలలో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.
PM Vidyalaxmi: విద్యార్థులకు ఆర్థికసాయం అందించేందుకు ‘పీఎం-విద్యాలక్ష్మి’ పథకం