Skip to main content

Gaganyaan Mission: వెల్‌డెక్ రిక‌వ‌రీ ట్ర‌య‌ల్ విజయవంతం

గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా క్రూ మాడ్యూల్‌కి సంబంధించిన 'వెల్‌డెక్' రికవరీ ట్రయల్స్ విజయవంతమైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) డిసెంబర్ 10వ తేదీ ఇస్రో తెలిపింది.
ISRO and Navy team up for Gaganyaan recovery trial  ISRO successfully conducts recovery trial of Gaganyaan crew module with Navy

ఈ ట్రయల్స్ డిసెంబర్ 6వ తేదీ విశాఖ తీరంలో నావికా దళం సహకారంతో చేపట్టబడ్డాయి.

ఈ ట్రయల్స్‌లో.. వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లి తమ విధులు ముగించుకున్న తర్వాత క్రూ మాడ్యూల్‌లో తిరిగి భూమిపైకి చేరుకుంటారు. ఈ క్రూ మాడ్యూల్‌ను సముద్ర జాలాల్లో పడేలా చేస్తారు. అక్కడి నుంచి తెస్తే వ్యోమగాములు సురక్షితంగా వెలుపలికి తిరిగి వస్తారు. మాడ్యూల్‌ను 4 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి అక్కడ నుంచి సముద్రంలో పడేలా చేసి దాన్ని వెలికి తీసే ప్రక్రియను ఇప్పటికే పలుమార్లు నిర్వహించారు. 

ఈ ట్రయల్స్‌లో నేవీ సిద్ధం చేసిన 'వెల్‌డెక్' షిప్‌ను ఉపయోగించారు. ఈ షిప్ డెక్ నీటిలో మునిగే ఉంటుంది. దీనివల్ల నీళ్లలో పడవలు, ఉపగ్రహాలను సులభంగా షిప్‌కి తరలించడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ రికవరీ ప్రక్రియకు ఇప్పటికే పలుమార్లు ట్రయల్స్ నిర్వహించబడ్డాయి.

PSLV-C59 Rocket: ‘ప్రోబా-3’ మిషన్ ప్రయోగం సూపర్‌ సక్సెస్

Published date : 11 Dec 2024 01:37PM

Photo Stories