Skip to main content

Proba-3 Satellite: ‘ప్రోబా-3’ మిషన్ ప్రయోగం సూపర్‌ సక్సెస్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ59 ప్రయోగం విజయవంతమైంది.
ISRO PSLV C59 Proba 3 Satellite Launch Live Full Details

శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ59 రాకెట్ ప్రోబా-3 శాటిలైట్స్‌ను మోసుకెళ్లింది. డిసెంబ‌ర్ 5వ తేదీ సాయంత్రం 4.04 నిమిషాలకు ప్రయోగం జరగ్గా.. నింగిలోకి సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్లింది రాకెట్‌.

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రూపొందించిన ప్రోబా-3 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించేందుకు, సూర్యుని బాహ్య వలయం కరోనాపై అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగం నిర్వహించారు. 
 
ప్రోబా-3లో రెండు ఉపగ్రహాలు ఉంటాయి. వీటి బరువు 550 కిలోలు.  ఈ ప్రాజెక్టు ఉద్దేశం.. సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాపై పరిశోధనలు చేయడం. ఈ ప్రయోగం చేపట్టడం ప్రపంచంలోనే ఇది మొదటిసారని ఈఎస్‌ఏ తెలిపింది. ఈ ప్రయోగం విజయవంతంపై శాస్త్రవేత్తలకు ఇస్రో చైర్మన్‌ సోమ్‌నాథ్‌ అభినందనలు తెలియజేశారు. ఈ నెలలోనే స్పేటెక్స్ పేరుతో PSLV-C60 ప్రయోగం చేప‌డ‌తామ‌ని ఆయ‌న అన్నారు.

ISRO: త్వ‌ర‌లో రెండు పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగాలను చేపట్టనున్న ఇస్రో

Published date : 06 Dec 2024 09:44AM

Photo Stories