Skip to main content

Cowpea Seeds: ఇస్రో పేలోడ్‌లో మొలకెత్తి ఆకులు తొడిగిన అలసందలు

అంతరిక్షంలో వ్యోమనౌకల అనుసంధానం కోసం ఉద్దేశించిన ప్రయోగంతోపాటు అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన మాడ్యూల్‌లో ఇస్రో చేపట్టిన ప్రయోగం మలి దశలోనూ విజయవంతమైంది.
ISRO Successfully Germinates Cowpea Seeds in Space

ఈ ప్రయోగం కోసం పంపిన కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ (క్రాప్స్) అనే ఉపగ్రహంలో, అంగీకరించిన విత్తనాలు, సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో మొలకెత్తే అవకాశం ఉందని పరిశోధన చేయడం లక్ష్యం.

ఈ ప్రయోగంలో.. నిమిది అలసంద విత్తనాలు ఉంచి, వాటి అభివృద్ధిని పరిశీలించారు. వాటిలో కొన్ని విత్తనాలు మొలకెత్తడంతో, అవి ఆకులను కూడా సంతరించుకున్నాయి. ఇది ఇస్రో శాస్త్రవేత్తలకు సంతోషం కలిగించింది.

జ‌న‌వ‌రి 6వ తేదీ ఇస్రో ప్రకటన ప్రకారం.. విత్తనాలు మొలకెత్తిన సమయంలో, ఆకులు వచ్చిన సమయంలో మాడ్యూల్‌లో వాతావరణం, ఉష్ణోగ్రత, మట్టిలో తేమ వంటి పర్యావరణ పరిస్థితులను కెమెరా, ఇతర ఉపకరణాలతో కొలిచారు.

ISRO: ఈ నెల‌లో 100వ ప్రయోగం చేయ‌నున్న‌ షార్.. ఇస్రో జీఎస్ఎల్‌వీ మిషన్‌ ఏర్పాట్లు

ఈ ప్రయోగం అంతరిక్షంలో మొక్కల పెంపకం గురించి శోధనలకు ఎంతో దోహదపడిందని ఇస్రో వెల్లడించింది. భవిష్యత్తులో అంతరిక్షంలో గడిపే వ్యోమగాముల ఆహార అవసరాలు తీర్చడానికి చెట్ల పెంపకం, ఆ చెట్లు సూక్ష్మ గురుత్వాకర్షణలో ఆకులు, ఫలాలను అందివ్వగలవా, నీటి అవసరాలు ఎలా ఉంటాయి వంటి అంశాలపై ఈ ప్రయోగం సాయపడిందని ఇస్రో పేర్కొంది.

Spadex Mission: ఇస్రో పీఎస్ఎల్‌వీ సీ60 ప్రయోగం విజయవంతం

Published date : 08 Jan 2025 10:20AM

Photo Stories