Skip to main content

EAPCET 2025 : ఈసారి ఎప్‌సెట్ నిర్వ‌హ‌ణ‌లో మార్పులు.. ఈ కారణంతోనే..

విద్యార్థులు ఇంజినీరింగ్‌, ఫార్మసీ వంటి కోర్సుల్లో ప్ర‌వేశాలు పొందేందుకు రాయాల్సిన ప‌రీక్ష ఎప్‌సెట్‌..
Online NEET exam announcement   Changes in eapcet 2025 exam due to dates issues  EAPCET and NEET exam preparation

సాక్షి ఎడ్యుకేష‌న్: విద్యార్థులు ఇంజినీరింగ్‌, ఫార్మసీ వంటి కోర్సుల్లో ప్ర‌వేశాలు పొందేందుకు రాయాల్సిన ప‌రీక్ష ఎప్‌సెట్‌.. ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హించేందుకు అడ్డంకులు ఆగ‌డం లేదు. జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్‌, జేఈఈ పరీక్షలు ఈ పరీక్ష నిర్వహణకు అడ్డంకిగా మారాయి. ఈ ప‌రీక్ష‌ల కార‌ణంగా ఆన్‌లైన్‌లో స్లాట్స్‌ దొర‌క‌డం క‌ష్టమైంది.

School holidays: అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. కారణమిదే!

దీంతో.. జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్‌ మధ్య ఉన్న‌ కొన్ని తేదీల్లో ఈ ఎప్‌సెట్ ప‌రీక్ష‌ను నిర్వహించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ సారి ఎప్‌సెట్‌ పరీక్షలకు నీట్‌ పరీక్షలు అడ్డంకిగా మార‌డంతో.. నీట్‌ పరీక్షలను ఇది వరకు ఆఫ్‌లైన్‌లో నిర్వహించగా, ఈ ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో నిర్వ‌హించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది, మే 6 నుంచి ఈ పరీక్షలు జ‌ర‌గ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు.

Model School Admissions 2025 : మోడ‌ల్ స్పూల్లో ఈ త‌ర‌గ‌తుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు.. ప్ర‌వేశ ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..

వెనువెంటనే..

ముందుగా, ఏప్రిల్ నెల‌లో జేఈఈ మెయిన్స్‌-2 పరీక్ష నిర్వ‌హిస్తారు. ఆ త‌రువాత మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తారు. ఇలా, ప్రతీ ప్ర‌వేశ ప‌రీక్ష‌లు వెంట వెంటనే ఉండ‌డంతో ఎప్‌సెట్‌కు ఆన్‌లైన్‌ స్లాట్లు దొరకని పరిస్థితి నెలకొన్నది. దీంతో సందిగ్ధత కొనసాగుతున్నది. ఎప్‌సెట్‌ సహా ఇతర పరీక్షల్లో స్థానికతపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటూ తేల్చలేదు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన పదేండ్ల గడువు పూర్తికావడంతో ఇప్పుడు కొత్తగా స్థానికతను నిర్ధారించాల్సి ఉంది. ఇది తేలితేనే ఎప్‌సెట్‌ నోటిఫికేషన్‌, షెడ్యూల్స్‌ను విడుదల చేయాల్సి ఉంటుంది. ఇందుకు కొంత సమయం పట్టే అవకాశముంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 08 Jan 2025 12:23PM

Photo Stories