Skip to main content

DEECET 2024: డీఈఈ సెట్‌ అభ్యర్థులకు 23 నుంచి వెబ్‌ ఆప్షన్లు

నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన డీఈఈ సెట్‌ – 2024లో ర్యాంకు సాధించిన వారికి డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఎల్‌ఈడీ) కోర్సుల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు వెబ్‌ కౌన్సిలింగ్‌కు షెడ్యూల్‌ విడుదల చేసినట్లు డైట్‌ ప్రిన్సిపాల్‌ అక్టోబర్ 18న ఒక ప్రకటనలో తెలిపారు.
Web options for DEECET candidates from 23

అక్టోబర్ 23 నుంచి 26 వరకు డీఈఈ–సెట్‌ 2024లో సాధించిన ర్యాంకు ప్రకారం వెబ్‌ ఆప్షన్ల నమోదు, 30వ తేదీన మెరిట్‌ – రోస్టరు ప్రకారం సీట్ల కేటాయింపు, 30 నుంచి నవంబర్‌ 3 వరకు ఫీ పేమెంట్‌, అడ్మిషన్‌ కేటాయింపు, 4వ తేదీన కాలేజీల్లో రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుందని తెలిపారు. గతంలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేయించుకోని అభ్యర్థులకు అక్టోబర్ 21న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

చదవండి: DEECET: డీఈఈసెట్‌లో కామారెడ్డి జిల్లావాసికి స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 19 Oct 2024 04:49PM

Photo Stories