Skip to main content

TET 2024 Exams: రేపటి నుంచి టెట్‌–2024 పరీక్షలు

TET 2024 Exams: రేపటి నుంచి టెట్‌–2024  పరీక్షలు
TET 2024 Exams: రేపటి నుంచి టెట్‌–2024 పరీక్షలు

అమరావతి: ఈ నెల 3 (గురువారం) నుంచి జరిగే టెట్‌–2024 (జూలై) పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పాఠశాల విద్య డైరెక్టర్‌ విజయరామరాజు ఓ ప్రకటనలో తెలి­పారు. ఈ నెల 21 వరకు ఎంపిక చేసిన సెంటర్లలో ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు జరు­గు­తా­యన్నారు. మొదటి సెషన్‌ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్‌ 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు. అన్ని జిల్లాల డీఈవో కార్యాలయాల్లో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశామని, అభ్యర్థులకు ఎలాంటి సందేహాలున్నా వీటిని సంప్రదించాలని సూచించారు. 

Also Read: 

దివ్యాంగ అభ్యర్థుల కోసం స్క్రైబ్‌ను ఏర్పాటు చేశామని, వారికి అదనంగా 50 నిమిషాల సమయం కేటా­యించి­నట్టు తెలిపారు. ఎవరికైనా రెండు హాల్‌ టికెట్లు వచ్చి ఉంటే వారు ఏదో ఒక సెంటర్‌ను మాత్రమే ఎంపిక చేసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రానికి సెల్‌ఫోన్‌ సహా ఎలాంటి ఎలక్ట్రా­నిక్‌ పరికరాలు అనుమతించబోమ­న్నారు. హాల్‌­టికెట్లలో తప్పులుంటే సరైన ఆధారాలు చూపి పరీక్ష కేంద్రంలోని అధికారి వద్దనున్న నామినల్‌ రోల్స్‌లో సరిచేసుకోవా­లని సూచిం­చారు. ఇప్పటి వరకు హాల్‌ టికెట్లు తీసుకోని అభ్యర్థులు  http:// cse.ap.gov.in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Published date : 02 Oct 2024 10:54AM

Photo Stories