CSIR UGC NET 2024: సైన్స్‌లో పరిశోధనలకు మార్గం ఇదిగో!.. ఎంపికైతే నెలకు రూ.37వేల ఫెలోషిప్ ..
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్‌ఐఆర్), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సంయుక్తంగా నిర్వహిస్తున్న పరీక్ష.. సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్. ప్రతి ఏటా రెండుసార్లు (జూన్, డిసెంబర్) ఈ పరీక్ష జరుగుతుంది. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు పేర్కొన్న ప్రాథమ్యం ఆధారంగా జేఆర్‌ఎఫ్‌కు లేదా లెక్చర్‌షిప్/అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్‌నకు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. పీహెచ్‌డీలోనూ ప్రవేశం పొందేందుకు అవకాశం ఉంటుంది.
మూడు కేటగిరీలు
సీఎస్‌ఐఆర్–యూజీసీ నెట్‌ను మూడు కేటగిరీల్లో నిర్వహిస్తారు. అవి.. జేఆర్‌ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్; అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ పీహెచ్‌డీ అడ్మిషన్; అడ్మిషన్ టు పీహెచ్‌డీ. జేఆర్‌ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీ ఉత్తీర్ణులకు జేఆర్‌ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్, పీహెచ్‌డీ అడ్మిషన్స్‌కు అర్హత లభిస్తుంది.
అసిస్టెంట్ ప్రొఫెసర్, పీహెచ్‌డీ అడ్మిషన్ కేటగిరీ ఉత్తీర్ణులకు అసిస్టెంట్ ప్రొఫెసర్, పీహెచ్‌డీ ప్రవేశాలకు అర్హత లభిస్తుంది. అడ్మిషన్ టు పీహెచ్‌డీ కేటగిరీ ఉత్తీర్ణులు కేవలం పీహెచ్‌డీలో ప్రవేశాలకే అర్హులవుతారు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో తమ అర్హతలకు అనుగుణంగా కేటగిరీ ప్రాథమ్యాలను పేర్కొనాల్సి ఉంటుంది.
చదవండి: 518 Jobs: నాల్కో, భువనేశ్వర్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. దరఖాస్తులకు చివరితేది ఇదే..
అయిదు విభాగాలు
సీఎస్‌ఐఆర్–యూజీసీ నెట్ ద్వారా సైన్సెస్‌కు సంబంధించిన అయిదు విభాగాల్లో పరీక్ష నిర్వహిస్తారు. అవి.. కెమికల్ సైన్సెస్; ఎర్త్, అట్మాస్ఫియరిక్ సైన్సెస్; ఓషియన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్; లైఫ్ సైన్సెస్; మ్యాథమెటికల్ సైన్సెస్; ఫిజికల్ సైన్సెస్. ఆయా విభాగాల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు పరిశోధన సంస్థల్లో పీహెచ్‌డీలో చేరేందుకు, జేఆర్‌ఎఫ్ పొందేందుకు అవకాశం లభిస్తుంది. అదేవిదంగా ఈ అయిదు విభాగాలకు సంబంధించి అధ్యాపక వృత్తిలో అడుగుపెట్టేందుకు అర్హత లభిస్తుంది.
అర్హతలు
కనీసం 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ బీఎస్–ఎంఎస్, నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బీఈ/బీటెక్/బీఫార్మసీ/ఎంబీబీఎస్, బీఎస్సీ ఆనర్స్ ఉత్తీర్ణత ఉండాలి. ఆయా కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే.
ఊ రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు ఆయా కోర్సుల్లో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులకు లెక్చర్‌షిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్‌లకు అర్హత లభించదు. బీఎస్సీ ఆనర్స్ చివరి సంవత్సరం చదువుతున్న వారికి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారికి దరఖాస్తుకు అర్హత లేదు.
చదవండి: JIPMER Recruitment: జిప్‌మర్, పుదుచ్చేరిలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు.. జీతం నెలకు రూ.67,700
వయసు
జేఆర్‌ఎఫ్ అభ్యర్థులు 2025 ఫిబ్రవరి 1 నాటికి 28 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వర్గాల వారికి అయిదేళ్లు, ఓబీసీ వర్గాల వారికి మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్, అడ్మిషన్ టు పీహెచ్‌డీ కేటగిరీ అభ్యర్థులకు ఎలాంటి గరిష్ట వయో పరిమితి నిబంధన లేదు.
200 మార్కులకు పరీక్ష
కెమికల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్; ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్‌లో 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఆయా సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నపత్రంలో పార్ట్ ఏ, పార్ట్ బీ, పార్ట్ సీ కేటగిరీలుగా ప్రశ్నలు ఉంటాయి. సదరు కేటగిరీల్లో నిర్దిష్ట సంఖ్యలో ప్రశ్నలు అడుగుతారు. పార్ట్ ఏ అన్ని సబ్జెక్టులకు కామన్‌గా జనరల్ అప్టిట్యూడ్‌పై ఉంటుంది. పార్ట్ బిలో సదరు సబ్జెక్టు సంబంధిత ఎంసీక్యూ ప్రశ్నలు ఉంటాయి. పార్ట్ సీలో అభ్యర్థికి సబ్జెక్టుపై ఉన్న లోతైన పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. మూడు గంటల వ్యవధిలో కంప్యూటర్ బెస్డ్ టెస్ట్ విధానంలో పరీక్ష జరుగుతుంది. ప్రశ్న పత్రం ఇంగ్లిష్/హిందీలో ఉంటుంది.
జేఆర్‌ఎఫ్ నెలకు రూ.37వేలు
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
- సీఎస్‌ఐఆర్–యూజీసీ నెట్‌లో విజయం సాధించి నిర్దేశిత ఇన్‌స్టిట్యూట్ లేదా రీసెర్చ్ లేబొరేటరీల్లో పీహెచ్‌డీ దిశగా ప్రవేశం పొందిన అభ్యర్థులకు రెండేళ్లపాటు నెలకు రూ. 37 వేలు చొప్పున జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జేఆర్‌ఎఫ్) అందుతుంది. దీంతోపాటు రెండేళ్లపాటు ప్రతి ఏటా రూ.20 వేల చొప్పున కాంటింజెంట్ గ్రాంట్ కూడా లభిస్తుంది.
- రెండేళ్ల తర్వాత పీహెచ్‌డీకి నమోదు చేసుకుంటే సీనియర్ రీసెర్చ్ ఫెలోగా పరిగణిస్తూ నెలకు రూ.42 వేలు చొప్పున ఫెలోషిప్ అందిస్తారు. ఇలా గరిష్టంగా మొత్తం అయిదేళ్ల పాటు జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్‌లు లభిస్తాయి.
- బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో సీఎస్‌ఐఆర్–యూజీసీ నెట్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు తొలి రెండేళ్లు ఎలాంటి ఫెలోషిప్ లభించదు. రెండేళ్లలోపు పీహెచ్‌డీ లేదా ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో పేరు నమోదుకు అర్హత పొందితేనే జేఆర్‌ఎఫ్ లభిస్తుంది.
అధ్యాపకులకు కనీస అర్హత
సీఎస్‌ఐఆర్–యూజీసీ నెట్‌లో ఉత్తీర్ణతతో అధ్యాపక వృత్తిలో అడుగుపెట్టే అవకాశం లభిస్తుంది. నిబంధనల ప్రకారం–ఉన్నత విద్యా సంస్థలు లెక్చరర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలకు సీఎస్‌ఐఆర్–యూజీసీ నెట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి. లెక్చర్‌షిప్‌కు అర్హత పొందిన అభ్యర్థులు యూజీసీ నిబంధనల ప్రకారం కళాశాలల్లో అధ్యాపకులుగా చేరొచ్చు. అదేవిధంగా సీఎస్‌ఐఆర్–యూజీసీ నెట్‌లో జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైన వారికి పరిశోధన లేబొరేటరీలు, ఐఐటీలు, ఎన్‌ఐటీలలో పీహెచ్‌డీ చేసే అవకాశం లభిస్తుంది.
బెస్ట్ స్కోర్ సాధించాలంటే పార్ట్–ఎ (జనరల్ ఆప్టిట్యూడ్)
పరీక్షలో ఉమ్మడి విభాగంగా జనరల్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. ఇందులో రాణించేందుకు తార్కిక విశ్లేషణ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, పజిల్స్ తదితర అంశాలపై దృష్టి పెట్టాలి. అదే విధంగా బేసిక్ జనరల్ నాలెడ్జ్/కరెంట్ అఫైర్స్ అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి.
పార్ట్–బి (సబ్జెక్ట్)
ప్రశ్నపత్రం పార్ట్–బిలో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇవి పూర్తిగా మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటాయి. అభ్యర్థులు తమ అకడమిక్ స్థాయి పుస్తకాలను లోతుగా అధ్యయనం చేయాలి. దీంతోపాటు అన్వయ దృక్పథంతో ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇందులో మార్కులు సాధించొచ్చు.
పార్ట్–సి (సబ్జెక్ట్)
ప్రశ్నపత్రం పార్ట్–సిలో ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్ సంబంధిత ప్రశ్నలే ఉంటాయి. వీటి క్లిష్టత స్థాయి అధికంగా ఉంటుంది. అభ్యర్థుల్లోని శాస్త్రీయ భావనలపై అవగాహన, శాస్త్రీయ భావనలను అన్వయించే నైపుణ్యాలను పరీక్షించే విధంగా పూర్తిగా విశ్లేషణాత్మక దృక్పథంతో సమాధానాలను గుర్తించాల్సిన విధంగా ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు పీజీ స్థాయి పుస్తకాలను చదవడం మేలు.
పీజీ పుస్తకాలే ఆదరవు
సీఎస్‌ఐఆర్–యూజీసీ నెట్ అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌లలో పీజీ స్థాయిలో పూర్తి అవగాహన పొందాలి. ముఖ్యంగా రీసెర్చ్ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్ సాగించాలి. తమ సబ్జెక్ట్‌లకు సంబంధించి ప్రస్తుతం ఉన్న సమస్యలు, వాటి పరిష్కారం దిశగా ఉపయోగపడే పరిశోధనల గురించి తెలుసుకోవాలి. దీనివల్ల పరీక్షలో ముఖ్యంగా పార్ట్–సిలో రాణించేందుకు మార్గం సుగమం అవుతుంది. అభ్యసనం చేసేటప్పుడే రీసెర్చ్ ఓరియెంటేషన్ అలవర్చుకోవడం లాభిస్తుంది.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, డిసెంబర్ 30
- సీఎస్‌ఐఆర్–యూజీసీ నెట్ తేదీలు: 2025 ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు
- వెబ్‌సైట్: https://csirnet.nta.ac.in
Tags
- CSIR UGC NET 2024
- Science and Technology
- PHD
- assistant professor
- Teaching profession
- CSIR UGC NET 2024 Exam Guidance
- CSIR
- UGC
- JRF
- CSIR NET
- Joint CSIR UGC NET
- CSIR NET 2024 Exam Day Guidelines
- Csir ugc net 2024 exam guidance pdf
- Csir ugc net 2024 exam guidance
- CSIR NET Dec 2024 application form
- CSIR NET Result 2024