Skip to main content

TS EAPCET Schedule 2025 : బ్రేకింగ్ న్యూస్‌.. ఈఏపీసెట్‌-2025తో పాటు వివిధ ప్రవేశ పరీక్షల తేదీలు ప్ర‌క‌ట‌న‌... ఏఏ ప‌రీక్ష ఎప్పుడంటే...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఈఏపీసెట్‌-2025 ప‌రీక్ష‌ల‌తో పాటు.. వివిధ ప్ర‌వేశ ప్ర‌రీక్ష‌ల తేదీల‌ను జ‌న‌వ‌రి 15వ (బుధ‌వారం) ప్ర‌క‌టించింది. ఈ సారి గ‌త ఏడాది కంటే... ముందుగానే ఈ ప‌రీక్ష‌ల తేదీల‌ను వెల్ల‌డించారు.
Telangana Council of Higher Education Announcement Entrance Exam Schedule 2025

2025 ఏప్రిల్ 29వ తేదీ నుంచి ఈఏపీసెట్‌-2025 ప‌రీక్ష‌లు జరగ‌నున్నాయి. అలాగే 2025 ఏప్రిల్‌ 29, 30 తేదీల్లో ఈఏపీసెట్‌ (అగ్రికల్చర్‌, ఫార్మసీ) పరీక్షలు జరగనున్నాయి. మే 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఈఏపీసెట్‌ (ఇంజినీరింగ్‌) పరీక్షలను నిర్వహించనున్నారు. ఇంట‌ర్ ఎంపీసీ (MPC), బైపీసీ (Bipc) విద్యార్థులు పై ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర కావాల్సి ఉంటుంది.

చదవండి: College Predictor - 2024 AP EAPCET TS EAMCET

➤☛ How to Overcome Exam Stress: పరీక్షల ఒత్తిడి.. ఈ టిప్స్‌ ఫాలో అయితే బెస్ట్‌

ఈసెట్, ఎడ్‌సెట్‌, లాసెట్ ఐసెట్ ప‌రీక్ష‌లు మాత్రం..
2025 మే 12వ తేదీన‌ ఈసెట్-2025 ప‌రీక్ష జ‌ర‌గ‌నున్న‌ది. అలాగే జూన్ 1వ తేదీన‌ ఎడ్‌సెట్-2025 ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. జూన్ 6వ తేదీన‌ లాసెట్-2025 ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. పీజీఎల్ సెట్-2025, జూన్ 8, 9 తేదీల్లో ఐసెట్, జూన్ 16 నుంచి 19వ తేదీన‌ వరకు పీజీఈసెట్ పరీక్షలు నిర్వ‌హిచ‌నున్నారు.

వివిధ ప్ర‌వేశ‌ పరీక్షల షెడ్యూల్ 2025 ఇదే ...:

ఏఏ ప‌రీక్ష ఎప్పుడంటే...?
☛➤ ఏప్రిల్ 29, 30న ఈఏపీసెట్ అగ్రికల్చర్‌, ఫార్మసీ
☛➤ మే 2 నుంచి 5 వరకు ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌
☛➤ మే 12న ఈసెట్
☛➤ జూన్ 1న ఎడ్‌సెట్‌
☛➤ జూన్ 6న లాసెట్, పీజీఎల్ సెట్
☛➤ జూన్ 8,9 తేదీల్లో ఐసెట్‌
☛➤ జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈసెట్ పరీక్షలు
☛➤ జూన్ 11 నుంచి 14 వరకు టీజీ పీఈసెట్

పూర్తి వివ‌రాలు ఇవే...

Published date : 15 Jan 2025 04:24PM
PDF

Photo Stories