Skip to main content

UGC NET January 15 Exam Postponed : యూజీసీ-నెట్ ప‌రీక్ష‌ వాయిదా... ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(నెట్‌) పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు చేసినట్టు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ప్రకటించింది. జ‌న‌వ‌రి 15వ తేదీన జరగాల్సిన యూజీసీ నెట్‌ వాయిదా పడింది.
UGC NET Exam Postponed 2025  UGC NET Exam Postponed Announcement  NTA Announces Change in UGC NET Exam Dates National Testing Agency Updates UGC NET Schedule

సంక్రాంతి పండుగ నేపథ్యంలో అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు జ‌న‌వ‌రి 15వ తేదీన‌ జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ఎన్‌టీఏ ప్ర‌క‌టించింది. జనవరి 16న జరగాల్సిన పరీక్ష మాత్రం యధావిధిగా అదే రోజున జరగనున్నట్టు ప్రకటించింది. జ‌న‌వ‌రి 15వ తేదీన వాయిదా ప‌డిన ప‌రీక్ష తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఎన్‌టీఏ తెలిపింది. ఈ మేర‌కు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.ac.inలో తాజా అప్డేట్ అందించింది.

➤☛ ICAI CA Exam Schedule 2025 : సీఏ పరీక్షల షెడ్యూల్ విడుద‌ల‌... ఏఏ ప‌రీక్ష ఎప్పుడంటే..?

యూజీసీ-నెట్ ప‌రీక్ష‌ను మాస్టర్ డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం నిర్వహిస్తుంది. దీని ద్వారా అభ్యర్థులు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం,  పీహెచ్‌డీ(PhD)లో ప్రవేశానికి అర్హత పొందుతారు. ప్రస్తుతం యూజీసీ నెట్ పరీక్ష మొత్తం 85 సబ్జెక్టులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సీబీటీ విధానంలో నిర్వ‌హించ‌నున్నారు.

Published date : 15 Jan 2025 08:15AM
PDF

Photo Stories