Skip to main content

6th Class Admissions: 18న నవోదయ ప్రవేశ పరీక్ష.. విద్యార్థులకు సూచనలు ఇవే..

బిజినేపల్లి: వట్టెం జవహార్‌ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో చేరికకు శనివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు విద్యాలయ ప్రిన్సిపాల్‌ పి.భాస్కర్‌కుమార్‌ జ‌న‌వ‌రి 15న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Navodaya Entrance Exam on 18th  Entrance examination for class 6 at Wattem Jawahar Navodaya Vidyalaya

ప్రవేశ పరీక్షకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 27 కేంద్రాలను ఎంపిక చేశామని, విద్యార్థులు www.Navodaya.gov.in అనే వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

విద్యార్థులు తమ హాల్‌టికెట్ల కోసం వెబ్‌సైట్‌లో తమ పుట్టిన తేదీతో లేదా రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో జ‌న‌వ‌రి 15న‌ బిజినేపల్లిలోని ఆర్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు, పరిశీలకులకు శిక్షణ ఇస్తామని చెప్పారు.

చదవండి: Navodaya : ఈ టిప్స్ పాటిస్తే... నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో విజయం మీదే

విద్యార్థులకు సూచనలు

హాల్‌టిక్కెట్లు లేని విద్యార్థులను పరీక్షకు అనుమతి ఉండదని, ఎలాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులను అనుమతి లేదు. పరీక్షను బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్నుతో మాత్రమే ఓఎంఆర్‌ షీటులో రాయాల్సి ఉంటుంది. పెన్సిల్‌తో రాసిన సమాధానాలు చెల్లవని, ప్రతి ప్రశ్నకు ఏదో ఒకదానిని గుర్తించి ఓఎంఆర్‌ షీట్‌లో సర్కిల్‌ను నింపాలని అధికారులు సూచిస్తున్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ప్రశ్నపత్రంపైనా, ఓఎంఆర్‌ షీటుపైన విద్యార్థి తన రూల్‌ నంబర్‌ను విధిగా వేయాలని, ఓవర్‌ రైటింగ్‌, కొట్టివేతలు, దిద్దుళ్లు చేసినా, వైట్‌నర్‌ ఉపయోగించినా ఆ ఓఎంఆర్‌ షీటు చెల్లదని సూచించారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉంటాయని పేర్కొన్నారు.

Published date : 17 Jan 2025 09:39AM

Photo Stories