TS EAMCET Hall Ticket Released: ఎంసెట్ హాల్‌టికెట్స్ విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ ఈఏపీసెట్ (ఎంసెట్)- 2024 హాల్‌టికెట్లు విడుదల అయ్యాయి. ఇప్పటికే బైపీసీ (అగ్రికల్చర్, ఫార్మా) విభాగానికి సంబంధించిన హాల్‌టికెట్లు మాత్రమే విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇంజనీరింగ్ విభాగం అభ్యర్థులకు సంబంధించిన హాల్‌టికెట్స్ రిలీజ్ చేశారు.
ఈ మేరకు ఎంసెట్ కన్వీనర్ ఓ ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు eapcet.tsche.ac.in/ నుంచి హాల్‌టికెట్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి తమ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ ఏడాది TS EAPCET 2024 పరీక్షకు దాదాపు 3.5 లక్షల మందికి పైగా అప్లై చేశారు. ఇంజినీరింగ్ విభాగానికి పరీక్షలకు 2.5 లక్షల మంది, అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలకు 98 వేల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం..TS EAMCET 2024 అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు మే 7, 8 తేదీల్లో, ఇంజినీరింగ్ పరీక్షలు మే 9, 10, 11 తేదీల్లో నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆధారిత (CBT) మోడ్‌లో మూడు గంటల పాటు పరీక్షను నిర్వహిస్తారు.
TS EAMCET 2024 హాల్‌టికెట్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ eamcet.tsche.ac.inను క్లిక్ చేయండి.
- హోం పేజీలో కనిపిస్తున్న హాల్‌టికెట్ డౌన్‌లోడ్ అనే లింక్‌పై క్లిక్ చేయండి.
- రిజిస్ట్రేషన్ నెంబర్/పుట్టిన తేదీ వివరాలతో లాగిన్ అవ్వండి
- TS EAMCET 2024 హాల్ టికెట్ మీ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది.
- తర్వాత హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి