TG EAPCET 2024: 96.7% ఫార్మసీ సీట్ల భర్తీ.. సీట్లు పొందిన విద్యార్థులు ఈ తేదీలోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఈఏపీ సెట్ అర్హత సాధించిన బైపీసీ విద్యార్థులకు వివిధ కోర్సుల్లో 96.7 శాతం సీట్లు కేటాయించారు.
తుది దశ సీట్ల కేటాయింపు వివరాలను సాంకేతిక విద్య విభాగం నవంబర్ 8న వెల్లడించింది. మొత్తం 11,060 సీట్లు అందుబాటులో ఉంటే, 10,692 సీట్లను భర్తీ చేశారు. ఇంకా 368 సీట్లు మిగిలిపోయాయి.
చదవండి: College Predictor - 2024 AP EAPCET | TS EAMCET
బి ఫార్మసీలో 8,649, ఫాం డిలో 1,684, బయో మెడికల్ ఇంజనీరింగ్‌లో 58, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ 120, బయో టెక్నాలజీలో 181 సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులు నవంబర్ 12వ తేదీలోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని అధికారులు సూచించారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 09 Nov 2024 12:03PM
Tags
- pharmacy seats
- TG EAPCET 2024
- BIPC students
- Department of Technical Education
- Pharm D Admissions
- B Pharmacy Admissions
- Bio Medical Engineering Admissions
- Pharmaceutical Engineering
- Biotechnology
- Telangana News
- TG EAPCET 2024 counselling
- TG EAPCET 2024 Seats Allotmnet List
- FinalPhaseAllotment
- TechnicalEducation
- RemainingSeats