Skip to main content

PJTSAU Admissions: వ్యవసాయ కోర్సులకు మూడో దశ కౌన్సెలింగ్‌.. కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే..

సాక్షి, హైదరాబాద్‌/ఏజీవర్సిటీ: వ్యవసాయ, ఉద్యాన కోర్సుల్లో రెగ్యులర్‌ కోటా సీట్ల ఖాళీల భర్తీ కోసం న‌వంబ‌ర్‌ 18వ తేదీ నుంచి మూడో దశ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు వ్యవసాయ వర్సిటీ న‌వంబ‌ర్‌ 10న ఒక ప్రకటనలో తెలిపింది.
Third Phase Counselling for Admission into Agricultural Courses  Third phase of counseling for agriculture and horticulture courses, November   Vacancies in agriculture and horticulture courses to be filled through counseling  Agriculture University counseling dates announced for regular quota seats

వ్యవసాయ, ఉద్యాన డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జరుగుతున్న స్పెషల్‌ కోటా మొదటి దశ కౌన్సెలింగ్‌ న‌వంబ‌ర్‌ 10తో పూర్తయింది.

రెండు దశల్లో జరిగిన రెగ్యులర్‌ కోటా కౌన్సెలింగ్, అలాగే న‌వంబ‌ర్‌ 10తో పూర్తయిన మొదటి దశ స్పెషల్‌ కోటా కౌన్సెలింగ్‌ తర్వాత వ్యవసాయ, అనుబంధ కోర్సుల్లో సుమారు 213 ఖాళీలు ఏర్పడినట్లు జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డి.శివాజీ తెలిపారు.

చదవండి: TG Universities: యూనివర్సిటీల్లో నాణ్యత మెరుగుకు కావాల్సినవి ఇవే.. బోధన సిబ్బంది పరిస్థితి ఇదీ..

బీఎస్సీ (హానర్స్‌) అగ్రికల్చర్‌లో 80, బీవీఎస్సీ – 08, బీఎస్సీ (హానర్స్‌) హార్టికల్చర్‌ – 70, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్‌ – 40, బీటెక్‌ ఫుడ్‌ టెక్నాలజీలో 15 సీట్లు ఖాళీగా ఉన్నట్టు వివరించారు. 18 నుంచి జరిగే మూడో దశ కౌన్సెలింగ్‌ ద్వారా ఈ కోర్సులలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయనున్నట్లు రిజిస్టార్‌ తెలిపారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

మూడో దశ కౌన్సెలింగ్‌ షెడ్యూలు, కోర్సుల్లో ఖాళీలు తదితర వివరాలను విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌  www.pjtau.edu.in లో పొందవచ్చని ఆయన వివరించారు. మెరిట్‌ ఆధారంగానే సీట్లను భర్తీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రవేశాల్లో దళారుల ప్రమేయం ఉండదని, వారి మాయ మాటలు నమ్మి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మోసపోవద్దని ఆయన సూచించారు.

Published date : 11 Nov 2024 11:58AM

Photo Stories