TGCHE: నెల ముందే ఇంజనీరింగ్ సెట్.. అన్ని ఉమ్మడి పరీక్షలు ముందే నిర్వహణౖ.. కారణం ఇదే..
ఈ దిశగా అవసరమైన కసరత్తు మొదలు పెట్టింది. జాతీయ ఇంజనీరింగ్ సంస్థల ఉమ్మడి ప్రవేశ పరీక్షల (జేఈఈ మెయిన్స్) తేదీలను ఎన్‌టీఏ ప్రకటించిన విషయం తెలిసింది.
జనవరిలో తొలి విడత, ఏప్రిల్‌లో రెండో విడత పరీక్షలు చేపడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి సంబంధించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్)ను నెల రోజుల ముందే నిర్వహించే యోచన చేస్తున్నట్టు మండలి వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం ఇంజనీరింగ్ క్లాసులు సెప్టెంబర్‌లో మొదలవుతున్నాయి. దీన్ని జూలై ఆఖరు లేదా ఆగస్టు మొదటి వారంలో మొదలయ్యేలా మార్పులు చేయాలని అధికారులు భావిస్తున్నారు. మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి దీనిపై అన్ని వర్గాలతోనూ చర్చలు జరుపుతున్నారు. అదే విధంగా పీజీ, లా, ఎడ్‌సెట్, ఈ–సెట్, ఐసెట్, పాలిసెట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్‌లను గతంతో పోల్చుకుంటే నెల రోజుల ముందే ఎలా నిర్వహించాలనేది పరిశీలిస్తున్నామని చైర్మన్ తెలిపారు. దీన్ని బట్టి చూస్తే ఇంటర్ పరీక్షలు ముగిసిన కొద్ది రోజుల్లోనే ఈఏపీసెట్ నిర్వహించే వీలుంది.
చదవండి: ఎంసెట్ - న్యూస్ | గైడెన్స్ | టిఎస్-ప్రివియస్ పేపర్స్ | గెస్ట్ కాలమ్
ప్రైవేటు కాలేజీలపై దృష్టి
ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో నాణ్యతపై ప్రధానంగా దృష్టి పెట్టాలనే ఆలోచన ఉన్నట్టు బాలకిష్టారెడ్డి మీడియాకు తెలిపారు. చాలా కాలేజీల్లో అర్హతలేని అధ్యాపకుల చేత పాఠాలు చెప్పిస్తున్నారని, దీనివల్ల ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత ఉండటం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిని సీరియస్‌గా తీసుకోవాలని మండలి భావిస్తోంది. త్వరలో అన్ని వర్సిటీల వైస్ చాన్స్‌లర్లతో ఈ విషయమై సమావేశం ఏర్పాటు చేయాలని చైర్మన్ భావిస్తున్నారు.
ప్రతి ప్రైవేటు కాలేజీలో ఎవరెవరు బోధిస్తున్నారు? వారి అర్హతలు ఏమిటి? అనే వివరాలు సేకరించాలని నిర్ణయించారు. అర్హత లేని వారిని తొలగించడంతో పాటు, అన్ని అర్హతలు ఉన్న వారికి టీ–శాట్ తోడ్పాటుతో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ తరహా పునఃశ్చరణ వల్ల బోధన విధానంలో మార్పు వస్తుందని భావిస్తున్నారు. మండలి పరిధిలో ఇప్పటివరకూ జరిగిన కార్యకలాపాలను సమీక్షించి, మరింత మెరుగ్గా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్టు బాలకిష్టారెడ్డి వివరించారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
ఇ–మెయిల్ చేస్తే చాలు
ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులు, సూచనలు, అర్జీలు ఇచ్చేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రతిరోజూ
అనేకమంది వస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఇ–మెయిల్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నామని బాలకిష్టారెడ్డి తెలిపారు.
మెయిల్ అందిన వెంటనే దానికి స్పందన వస్తుందని, వీలైనంత త్వరగా పరిశీలించి, అవసరమైన న్యాయం చేయడానికి ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు.
Tags
- TG EAPCET 2025
- Engineering
- Degree
- PG
- TG Common Entrance Tests
- Telangana Council of Higher Education
- JEE Mains
- Agriculture and Medical Common Entrance Test
- JNTUH
- Dr Balakista Reddy
- admissions
- Telangana News
- Private Engineering Colleges
- Telangana Common Entrance Test 2025
- TG CETs 2025
- TG CET Schedule 2025
- EdCET
- ECET
- ICET
- LAWCET
- CommonEntranceExamination
- EngineeringEntrance
- Cet2024
- StateCouncilOfHigherEducation