AE Jobs: అసిస్టెంట్ ఇంజనీర్లకు పోస్టింగ్ ఇవ్వాలి
Sakshi Education
పాల్వంచ: పవర్ జనరేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యాన 339 అసిస్టెంట్ ఇంజనీర్ల నియామకానికి రాతపరీక్ష నిర్వహించి ఫలితాలు విడుదల చేసినందున త్వరగా పోస్టింగ్ ఇవ్వాలని కేటీపీఎస్ 5, 6వ దశల బ్రాంచ్ కార్యదర్శి డి.ఉమామహేశ్వరరావు కోరారు.
ఈ సందర్భగా నవంబర్ 19న సీఈ ఎం.ప్రభాకర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం కార్యదర్శి దర్బంగా మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్లకు బదిలీలు చేపట్టడంతో పాటు కేటీపీఎస్ 5, 6వ దశల్లో ఖాళీగా ఉన్న 57 ఇంజనీర్ల పోస్టులు భర్తీ చేయాలన్నారు.
చదవండి: AITUC: ‘సింగరేణి’ లాభాల వాటాలో టాప్‌టెన్ వీరే
అసోసియేషన్ నాయకులు జయభాస్కర్, చంద్రకళాధర్, పావని, ఎన్.ప్రదీప్, టి.దివాకర్, కె.మధుసూదన్, బి.రామారావు తదితరులు పాల్గొన్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 21 Nov 2024 10:37AM