Skip to main content

Tomorrow Holiday : రేపు కూడా సెల‌వు.. కానీ..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మృతి చెందిన నేపథ్యంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు డిసెంబ‌ర్ 27వ తేదీన (శుక్రవారం) సెలవు ప్ర‌భుత్వం ఇచ్చిన విష‌యం తెల్సిందే.
Tomorrow Holiday 2024   Holiday announcement for government offices and educational institutions on December 27th   Central government declares holiday for employees on December 28th

అయితే మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 28వ తేదీన కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక పూట సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వుల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఒక్క పూట సెలవు ఉండనుంది. డిసెంబర్ 28న రాజ్‌ఘాట్ సమీపంలో కేంద్ర ప్రభుత్వం ఫ్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

వారం రోజులు పాటు...
నేటి నుంచి వారం రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి డిసెంబ‌ర్ 26వ తేదీన (గురువారం) రాత్రి ఆదేశాల‌ను జారీ చేశారు.

అలాగే ఏపీలో నో...?
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మృతి చెందిన నేపథ్యంలో తెలంగాణ‌లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు డిసెంబ‌ర్ 27వ తేదీన (శుక్రవారం) ప్ర‌భుత‌వం సెలవు ప్రకటించిన విష‌యం తెల్సిందే. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాలేజీలు, స్కూల్స్‌, కార్యాల‌యాలకు కూడా సెల‌వు ఇవ్వ‌లేదు.

జనవరి నుంచి డిసెంబర్ 2025 వ‌ర‌కు సెల‌వులు ఇవే :

holidays news

జ‌న‌వ‌రి 2025 :
➤☛ నూతన సంవత్సరం – 01
➤☛ భోగి – 13
➤☛ సంక్రాంతి – 14
➤☛ రిపబ్లిక్ డే – 26

ఫిబ్రవరి 2025 :
➤☛ మహ శివరాత్రి – 26

మార్చి–2025 :
➤☛ హోలీ – 14
➤☛ ఉగాది – 30
➤☛ రంజాన్ -31

ఏప్రిల్ – 2025 :
➤☛ రంజాన్ తర్వాత రోజు -01
➤☛ బాబు జగజ్జీవనరావు జయంతి – 05
➤☛ శ్రీరామ నవమి – 06
➤☛ అంబేడ్కర్ జయంతి – 14
➤☛ గుడ్ ఫ్రైడే – 18

జూన్ -2025 :
➤☛బక్రీద్ – 07

జూలై – 2025 :
➤☛ మొహర్రం – 06

ఆగస్టు – 2025 :
➤☛ స్వతంత్ర దినోత్సవం – 15
➤☛ కృష్ణాష్టమి -16
➤☛ వినాయక చవితి – 27

సెప్టెంబర్–2025 :
➤☛ మిలాద్ నబీ – 05

అక్టోబర్-2025 :
➤☛ గాంధీ జయంతి – 02
➤☛ దసరా తర్వాత రోజు – 03
➤☛ దీపావళి – 20

నవంబర్–2025 :
➤☛ కార్తీక పౌర్ణమి/ గురు నానక్ జయంతి – 05

డిసెంబర్–2025 :
➤☛ క్రిస్మస్ – 25

Published date : 28 Dec 2024 08:54AM

Photo Stories