Skip to main content

January 1st Holiday 2025 : రేపు విద్యా సంస్థలు, కార్యాలయాలకు సెల‌వు ప్ర‌క‌ట‌న‌.. కానీ ఏపీలో మాత్రం నో హాలిడే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇటీవ‌ల కాలంలో స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఎక్క‌వ‌గా వ‌స్తున్న విష‌యంలో తెల్సిందే. అయితే 2025 నూతన సంవత్సరంలో కూడా స్కూల్స్‌, కాలేజీలు, కార్యాలయాలు సెల‌వుతోనే ప్రారంభం అయింది.
January 1st Holiday 2025

తెలంగాణ ప్రభుత్వం జనవరి 1న నూతన సంవత్సరం సంద‌ర్భంగా పబ్లిక్ హాలిడేను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు రేపు సెల‌వు ఉంటుంది.

☛➤ January Schools and Colleges Holidays 2025 : జనవరి 2025 లో స్కూళ్లు, కాలేజీలకు సెల‌వులు ఇంతేనా..? కానీ వీళ్ల‌కు మాత్రం...

ఏపీలో నో హాలిడే..!
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి 1వ తేదీన‌ ప్రత్యేకమైన సెలవు ప్రకటించలేదు ప్ర‌భుత్వం. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూల్స్‌, కాలేజీలు ఇతర సంస్థలు యథావిధిగా నడుస్తాయి. ప్రభుత్వం ప్రత్యేక హాలిడే ఇవ్వకపోవడం పట్ల కొందరు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. జనవరి 1వ తేదీని సెలవు దినంగా కాకుండా.. ఆప్షనల్ హలీడేగా ప్రకటించినట్లు తెలుస్తొంది. దీంతో ప్రభుత్వ సెలవు లేదని.. కేవలం ఆరోజు ఆప్షనల్ హలీడే ఉందని తెలుస్తొంది. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలు యథాతథంగా నడవనున్నట్లు తెలుస్తొంది. 

చాలా మంది కొత్త ఏడాది వచ్చిందంటే... వరుసగా సెలవులు పెట్టి ఎక్కడికైన టెంపుల్స్ లేదా సరదాగా గడిపే విధంగా ప్లాన్లులు చేసుకుంటారు. అయితే.. ఈసారి మాత్రం ఏపీ కూటమి సర్కారు ఈ విధంగా ట్విస్ట్ ఇచ్చిందేంటీ అని చాలా మంది తీవ్ర నిరాశ చెందుతున్నారు.

Holidays List 2025 : వ‌చ్చే ఏడాది 2025లో 50 రోజులకు పైగా సెల‌వులు... ఎలా అంటే..? ఈ టెక్నిక్ పాటిస్తే...!

 

జనవరి నుంచి డిసెంబర్ 2025 వ‌ర‌కు సెల‌వులు ఇవే :
జ‌న‌వ‌రి 2025 :
➤☛ నూతన సంవత్సరం – 01
➤☛ భోగి – 13
➤☛ సంక్రాంతి – 14
➤☛ రిపబ్లిక్ డే – 26

ఫిబ్రవరి 2025 :
➤☛ మహ శివరాత్రి – 26

మార్చి–2025 :
➤☛ హోలీ – 14
➤☛ ఉగాది – 30
➤☛ రంజాన్ -31

ఏప్రిల్ – 2025 :
➤☛ రంజాన్ తర్వాత రోజు -01
➤☛ బాబు జగజ్జీవనరావు జయంతి – 05
➤☛ శ్రీరామ నవమి – 06
➤☛ అంబేడ్కర్ జయంతి – 14
➤☛ గుడ్ ఫ్రైడే – 18

జూన్ -2025 :
➤☛బక్రీద్ – 07

జూలై – 2025 :
➤☛ మొహర్రం – 06

ఆగస్టు – 2025 :
➤☛ స్వతంత్ర దినోత్సవం – 15
➤☛ కృష్ణాష్టమి -16
➤☛ వినాయక చవితి – 27

సెప్టెంబర్–2025 :
➤☛ మిలాద్ నబీ – 05

అక్టోబర్-2025 :
➤☛ గాంధీ జయంతి – 02
➤☛ దసరా తర్వాత రోజు – 03
➤☛ దీపావళి – 20

నవంబర్–2025 :
➤☛ కార్తీక పౌర్ణమి/ గురు నానక్ జయంతి – 05

డిసెంబర్–2025 :
➤☛ క్రిస్మస్ – 25

Published date : 02 Jan 2025 09:57AM

Photo Stories