Skip to main content

School Holidays: మూడు రోజులు భారీ వ‌ర్షాలు.. పాఠ‌శాల‌ల‌కు సెల‌వు..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఢిల్లీలో ఎడ‌తెరిపి లేకుండా భారీ నుంచి అతి వ‌ర్షాలు కురుస్తున్న విష‌యం తెల్సిందే. దేశ రాజధాని నగరం ఢిల్లీలో వర్షం సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఏకంగా 101 ఏళ్ల తర్వాత ఢిల్లీలో డిసెంబర్‌ నెలలో 24 గంటల వ్యవధిలో అత్యధిక వర్షం నమోదై రికార్డు సృష్టించింది.
Heavy rains for three days Holidays for schools

డిసెంబర్ 27 నుంచి 29 వరకు బలమైన గాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. వాతావరణ పరిస్థితిని తెలుసుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించబడింది.

చదవండి: School Fees: స్కూళ్ల ఫీ‘జులుం’కు చెక్‌!.. ప్రైవేటు స్కూళ్ల వాదన ఇలా..

రానున్న రెండు మూడు రోజులు పాటు భారీ వ‌ర్షాలు కురుస్తున్న విష‌యం తెల్సిందే. ఎడతెరిపిలేని వర్షాలతో ఢిల్లీ వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. భారీ వర్షాలు, వరద ఉద్ధృతి కారణంగా  విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని ఢిల్లీ ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆదేశాలు పాటించని విద్యా సంస్థలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 28 Dec 2024 03:45PM

Photo Stories