Skip to main content

Pakistani Woman Govt Teacher in UP: పాక్‌ మహిళ.. యూపీలో ప్రభుత్వ టీచర్‌.. ఎలా!

బరేలీ: పాకిస్తాన్‌కు చెందిన ఓ మహిళ ఫోర్జరీ పత్రాలు చూపి 2015లో ఏకంగా ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగం సాధించింది. విచారణలో నిజాలు వెలుగు చూడటంతో అధికారులు ఆమెను తొలగించారు. అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు.
Pakistani woman Govt teacher in UP

యూపీలో ఈ ఘటన వెలుగు చూసింది. షుమైలా ఖాన్‌ అనే మహిళ మాధోపూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో సహాయ టీచర్‌గా 2015లో జాయినయ్యారు. ఆ సమయంలో ఆమె రాంపూర్‌ జిల్లా సదర్‌ సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ పేరుతో జారీ చేసిన నివాస ధ్రువీకరణ పత్రం సమర్పించారు.

అనుమానం వచ్చిన అధికారులు విచారణ జరపగా అది ఫోర్జరీ చేసిన సర్టిఫికెట్‌ అని, ఆమె పాకిస్తాన్‌ దేశస్తురాలని తేలింది. ఉద్యోగం పొందేందుకు ఆమె సమర్పించినవన్నీ ఫోర్జరీ సర్టిఫికెట్లేనని కూడా వెల్లడైందని బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ అధికారి భాను శంకర్‌ వెల్లడించారు.

చదవండి: Two New Courses : త్వ‌ర‌లోనే రెండు కోత్త కోర్సులు.. ఈ విద్యార్థుల‌కే..!

నివాస ధ్రువీకరణ పత్రాన్ని కూడా తప్పుడు సమాచారం ఆధారంగా జారీ అయినట్లు తెలిసి, తర్వాత రద్దు చేశారు. గతేడాది అక్టోబర్‌ 3న ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. విధుల్లో జాయినైన తేదీ నుంచి ఇది వర్తించనుంది.

అధికారులిచ్చిన ఫిర్యాదు మేరకు షుమైలా ఖాన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఫతేహ్‌గంజ్‌(వెస్ట్‌) అదనపు ఎస్‌పీ ముకేశ్‌ చంద్ర మిశ్రా శుక్రవారం వివరించారు. ఆమెను అరెస్ట్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.   

Published date : 20 Jan 2025 02:56PM

Photo Stories