Skip to main content

Professors Retirement Age: ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసు పెంపు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ల పదవీ విరమణ వయో పరిమితిని 60 నుంచి 65 ఏళ్ళకు పెంచారు.
Retirement of Professors 65

ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా జ‌న‌వ‌రి 30న‌ జీవో విడుదల చేశారు. ఈ నిర్ణయం వల్ల సమీప భవిష్యత్తులో రిటైర్‌ అవ్వాల్సిన 500 మంది వారివారి ఉద్యోగాల్లో కొనసాగనున్నారు. కాగా వయో పరిమితి పెంచడానికి గల కారణాలను జీవోలో స్పష్టం చేశారు. వర్సిటీల్లో 2013 నుంచి నియామకాలు చేపట్టలేదు. మరోవైపు చాలామంది అధ్యాపకులు రిటైర్‌ అయ్యారు. దీంతో వర్సిటీల్లో విద్యా ప్రమాణాలు పడిపోయాయి. న్యాక్, ఎన్‌బీఏ తదితర జాతీయ, అంతర్జాతీయ ర్యాంకుల్లో వెనుకబడ్డాయి.

చదవండి: Webinar: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికోసం..'సాక్షి ఎడ్యుకేషన్'‌ ప్రత్యేకంగా..

పరిశోధన ప్రమాణాలు కూడా కుంటుపడ్డాయి. ఈ పరిస్థితులపై ప్రభుత్వానికి ఇటీవల ఉన్నత విద్యా మండలి ఓ నివేదిక ఇచ్చింది. ఈ సందర్భంగా దేశంలోని అనేక యూనివర్సిటీల్లో పదవీ విరమణ వయసు 65 ఏళ్ళు ఉందని పేర్కొంది. 22 ప్రధాన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని విశ్వవిద్యాలయాల్లో వయో పరిమితి వివరాలను ఈ నివేదికలో పొందుపరిచింది. 

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

పలు రాష్ట్రాల్లో 60 ఏళ్లకు పైనే.. 

పశ్చిమ బెంగాల్, బిహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పుదుచ్చేరి, ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ప్రొఫెసర్ల రిటైర్‌మెంట్‌ వయసు 65 ఏళ్ళుగా ఉందని మండలి తెలిపింది. కర్ణాటక, గుజరాత్, ఒడిశా, కేరళ, ఛత్తీస్‌గఢ్, గోవా, హరియాణా, జమ్మూకశ్మీర్, మిజోరంలో 62 ఏళ్ళుగా ఉందని వివరించింది. అదే సమయంలో తెలంగాణ, తమిళనాడు, పంజాబ్‌ రాష్ట్రాల్లో మాత్రం ప్రొఫెసర్ల రిటైర్‌మెంట్‌ వయసు 60 ఏళ్ళుగానే ఉందని వివరించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో 2,878 ప్రొఫెసర్‌ పోస్టులు ఉన్నాయి. కానీ 753 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఏకంగా 2,125 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే 1,170 మంది ప్రొఫెసర్లు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు.    
 

Published date : 31 Jan 2025 01:09PM

Photo Stories