Skip to main content

APSRTC Jobs Notifications : ఏపీ ఆర్టీసీలో 11,500 ఉద్యోగాలు.. నోటిఫికేష‌న్ మాత్రం అప్పుడే..? కానీ ఈలోపు..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ప్రతి ఏటా ఏపీ ఆర్టీసీలో ఉద్యోగులు పదవీ విరమణ పొందుతూనే వున్నారు. దీంతో చాలా ఖాళీలు ఏర్పడ్డాయి. కానీ ఈ ఖాళీల‌ను మాత్రం భర్తీ చేయడం లేదు.
APSRTC Jobs Notifications 2024  AP RTC employees retiring creating vacancies  Government approval for AP RTC job notification  AP RTC 11,500 job vacancies announcement  RTC senior officials report on vacancies

ఇప్పటికే ఆర్టీసీ ఉన్నతాధికారులు ఖాళీలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపించింది. ఇక కూటమి ప్రభుత్వ ఆమోదమే మిగిలింది. ప్రభుత్వం ఒకే అంటే ఏకంగా 11,500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది.

ఇక ఏపీ కూటమి ఎన్నికల హామీల్లో మహిళలకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం ఒకటి. ఈ హామీని నెరవేర్చేందుకు సర్కార్ సిద్దమయ్యింది. ఈ పథకం అమలుపై అధ్యయనం కోసం రవాణామంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు చేశారు. దీని సూచనల మేరకు మహిళలకు ఉచిత ప్రయాణ హామీని అమలుచేయనుంది చంద్రబాబు ప్రభుత్వం.

➤☛ January Schools and Colleges Holidays 2025 : జనవరి 2025 లో స్కూళ్లు, కాలేజీలకు సెల‌వులు ఇంతేనా..? కానీ వీళ్ల‌కు మాత్రం...

APRTC ఉద్యోగాల వివరాలు ఇవే : 
మహిళలకు ఉచిత ప్రయాణం కోసం.. బస్సులను కొంటే సరిపోతుంది. అలాగే వాటిని నడిపేందుకు డ్రైవర్లు, కండక్టర్లు కావాలి. మెయింటెయిన్ కోసం మెకానిక్, ఇతర సిబ్బంది అవసరం. ఇలా మొత్తంగా 11,500 మంది ఉద్యోగులను నియమించుకోవాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించారు APRTC ఉన్నతోద్యోగులు. చాలా తక్కువ విద్యార్హతతో మంచి జీతంతో ప్రభుత్వరంగ సంస్థలో జాబ్‌ కాబట్టి ఈ ఉద్యోగాలకు పోటీ చాలా ఎక్కువగా వుంటుంది.

ఇలా కొత్తగా APRTC నియమించే ఉద్యోగాల్లో అత్యధికంగా డ్రైవర్లు, కండక్టర్లు ఉండనున్నాయి. ఈ ఉద్యోగాలే 10,000 వరకు ఉంటాయి. మిగతా జూనియర్ అసిస్టెంట్, సూపర్వైజర్లు వంటి పోస్టులు మరో 1500 వరకు ఉంటాయి.

Published date : 28 Dec 2024 09:30AM

Photo Stories