Skip to main content

TS Government Jobs : కొత్త‌గా 450 గ్రూప్‌-1, 700 గ్రూప్-2 పోస్టుల‌తో పాటు.. 6000 డీఎస్సీ, 10000 పోలీసు జాబ్స్‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌... ఎప్పుడంటే...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప్ర‌భుత్వం కొత్త‌ ఏడాదిలో వివిధ ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీకి క‌స‌ర‌త్తు చేస్తుంది. ఇందులో భాగంలో.. వ‌చ్చే నెల‌లో అన‌గా ఫిబ్ర‌వ‌రిలో నెల‌లో మ‌రో డీఎస్సీ నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు.
Telangana Government Teacher Recruitment  Government Jobs 2024 in Telangana  Telangana New DSC and Police and Group 1 and Group 2 Government Jobs Notifications 2025

జ‌న‌వ‌రి 20వ తేదీ వ‌ర‌కు తెలంగాణ టెట్ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ప‌రీక్ష‌లు ముగియ‌గానే డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల‌పై విద్యాశాఖ క‌స‌ర‌త్తు చేసి.. ఫిబ్ర‌వ‌రి నెల 2వ వారంలో డీఎస్సీ నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్న‌ది. ఈ సారి 5000-6000 టీచ‌ర్ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు. ఈ మేర‌కు రాష్ట్ర‌ప్ర‌భుత్వం విద్యాశాఖ‌ను ఆదేశించింది. 

TG Court Jobs Applications 2025 : 1673 కోర్టు ఉద్యోగాలు.. ఇలా ఫాలో అయి దరఖాస్తు చేసుకోండి...

త్వ‌ర‌లోనే 8000 నుంచి 10000 పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌..?
అలాగే పోలీసు శాఖ‌లోని కానిస్టేబుల్ , ఎస్ఐ ఉద్యోగాల‌కు కూడా త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్న‌ది ప్ర‌భుత్వం. ఈ మేర‌కు తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ నియామక మండలి క‌స‌ర‌త్తు చేస్తుంది. ఈ పోలీసు ఉద్యోగాల‌కు ఫిబ్ర‌వ‌రి చివ‌రి వారంలో లేదా మార్చి మొద‌టి వారం నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు. వ‌చ్చే నెల ఫిబ్ర‌వ‌రి నుంచి మే వ‌ర‌కు వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్లు వ‌రుస‌గా ఇవ్వ‌నున్న‌ది. 

చదవండి: TS పోలీస్ - గైడెన్స్ | స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | మోడల్ పేపర్స్ | ఆన్ లైన్ టెస్ట్స్ | వీడియోస్ | AP పోలీస్

మే నెలలో గ్రూప్స్‌-1, 2 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌..?
తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ద్వారా మే నెల‌లో దాదాపు 450 గ్రూప్‌-1 పోస్టుల‌కు కొత్త నోటిఫికేష‌న్ ఇచ్చే అవ‌కాశం ఉంది. అలాగే 600-700 గ్రూప్‌-2 పోస్టుల‌కు కూడా.. నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు. ఇప్ప‌టికే ఖాళీగా ఉన్న‌ వివిధ శాఖ‌ల్లోని గ్రూప్-1, 2 పోస్టుల‌ను ప్ర‌భుత్వ సేక‌రిస్తోంది. మే లేదా జూన్ నెల‌లో ఈ గ్రూప్‌-1,2 ఉద్యోగాల‌కు కొత్త‌గా నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం. ప్ర‌స్తుతం ఉన్న గ్రూప్‌-1,2 ఫ‌లితాల విడుద‌ల అనంతం కొత్త‌గా మ‌రో సారి గ్రూప్‌-1,2 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు. మొత్తానికి తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చే ఆరు నెల‌ల్లో వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి వ‌రుస‌గా నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు.

Published date : 16 Jan 2025 08:41AM

Photo Stories