Skip to main content

TG Court Jobs Applications 2025 : 1673 కోర్టు ఉద్యోగాలు.. ఇలా ఫాలో అయి దరఖాస్తు చేసుకోండి...

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లోని వివిధ‌ కోర్టుల్లో 1673 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తులు ప్రారంభ‌మైన‌వి. మొత్తం 1673 ఉద్యోగాలు ఉన్నాయి.
Applications open for 1673 court jobs in Telangana  Telangana courts recruitment for 1673 positions  Apply for 1673 court posts in Telangana  TG Court Jobs Applications 2025  Telangana court recruitment notification for 1673 posts

ఇందులో 1277 టెక్నికల్ ఉద్యోగాలు ఉన్నాయి.. మరో 184 నాన్-టెక్నికల్ కోటాలో ఉన్నాయి. ఇక తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్ కింద మరో 212 పోస్టులను కూడా రిక్రూట్ చేయనున్నారు. వీటికి ఏప్రిల్‌,  జూన్‌లో రాత పరీక్షలు జరుగుతాయి. అర్హులైన అభ్యర్థులు https://tshc.gov.in/ వెబ్ సైట్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఈ ఉద్యోగాలకు ఇలా ఫాలో అయి దరఖాస్తు చేసుకోండి వ‌చ్చు...
అర్హులైన అభ్యర్థులు https://tshc.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లాలి. హోం పేజీలో కనిపించే రిక్రూట్ మెంట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ పలు నోటిఫికేషన్ల నెంబర్లతో కనిపించే లింక్స్ కనిపిస్తాయి. మీరు ఏ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకుంటున్నారో అక్కడ క్లిక్ చేయాలి. పార్ట్ ఏలో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓటీపీఆర్ ఐడీ, పాస్ వర్డ్ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత పార్ట్ బీలో అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. నిర్ణయించిన రుసుం చెల్లించాలి. వివరాల పూర్తి తర్వాత సబ్మిట్ బటన్ పై నొక్కాలి. మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది.

Published date : 08 Jan 2025 01:01PM

Photo Stories