Anganwadi Jobs 2025 : భారీగా అంగన్‌వాడీ ఉద్యోగాలు.. ఇంకెప్పుడు భర్తీ చేస్తారంటే...? ఈ జిల్లాల్లోనే ఎక్కువగా...
కొన్నిప్రాంతాల్లో ఇన్‌చార్జిలతో నెట్టుకొస్తున్నారు. అంగన్‌వాడీ టీచర్ పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. మహిళా, శిశు సంరక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్, ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
➤☛ TS Government Jobs : 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఇంకెప్పుడు భర్తీ చేస్తారు ...? ఈ ఏడాదిలో...
ఈ పోస్టులను భర్తీ చేయకపోవడంతో లబ్ధిదారులకు పౌష్టికాహారం సక్రమంగా అందడం లేదు. గ్రామాలు, పట్టణాల్లో ఉండే గర్భిణులు, బాలింతలు, ఐదేండ్లలోపు పిల్లలు రక్తహీనతకు గురికాకుండా, శారీరకంగా బలహీనం కాకుండా ఉండేందుకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రతిరోజూ పాలు, ఉడకబెట్టిన కోడిగుడ్డుతో పాటు ఆకుకూరలు, ఇతర కూరలతో పౌష్టికాహారం అందిస్తున్నారు. కేంద్రాల్లో టీచర్లు ఉంటేనే అందరికీ పౌష్టికాహారం సక్రమంగా అందతుంది. అంతేకాదు ఆరోగ్య, ఇతర సర్వే ల బాధ్యతలను ఎక్కువగా అంగన్‌వాడీ టీచర్లకే అప్పగిస్తుంటారు.
టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్రాల నిర్వహణ బాధ్యతను పక్క కేంద్రాల టీచర్లకు అప్పగించడంతో వారిపై అదనపు పనిభారం పడుతున్నది. ఆయా పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్రాల్లో టీచర్లే ఆ భారాన్ని మోస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు. ఆయాలు లేని కేంద్రాల్లో టీచర్లకు సర్వే బాధ్యతలు అప్పగించడంతో కేంద్రాలు మూతబడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని మహిళలు కోరుతున్నారు.
నోటిఫికేషన్ వచ్చాకే..?
జిల్లాలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర కమిషనరేట్ నుంచి నోటిఫికేషన్ రావాల్సి ఉందని... నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోస్టులను భర్తీ చేస్తామని మెదక్ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి హైమావతి తెలిపారు. ఇప్పటికే జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్, ఆయా పోస్టుల వివరాలు సేకరించాం. ఆయాలు లేని కేంద్రాల్లో టీచర్లే పనిచేస్తున్నారు. కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లకు అదనపు బాధ్యతలు అప్పగించాం.
1076 మంది అంగన్‌వాడీ టీచర్లు..
మెదక్ జిల్లాలో నాలుగు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో అల్లాదుర్గం, మెదక్, నర్సాపూర్, రామాయంపేట ఉన్నాయి. వీటిలో 0 నుంచి 3 సంవత్సరాలలోపు చిన్నారులు 31,286 మంది, 3 నుంచి 6 ఏండ్లలోపు పిల్లలు 22,299 మంది చొప్పున మొత్తం 53,585 మంది ఉన్నారు. మెదక్ జిల్లాలో 5,293 మంది గర్భిణులు ఉండగా, బాలింతలు 4,651 మంది ఉన్నారు. నాలుగు ప్రాజెక్టుల పరిధిలో 1076 మంది అంగన్‌వాడీ టీచర్లు పనిచేస్తున్నారు. అల్లాదుర్గంలో 230 సెంటర్లు పనిచేస్తుండగా, మెదక్‌లో 278 సెంటర్లు, నర్సాపూర్‌లో 288 కేంద్రాలు, రామాయంపేటలో 280 సెంటర్లు ఉన్నాయి. మొత్తం 1076 కేంద్రాలకు గాను 1,043 మంది టీచర్లు ఉన్నారు.
ఈ ఉద్యోగాలకు అర్హతలు ఇవే..
ఇందులో 33 టీచర్ పోస్టులు ఖాళీగా ఉండగా, ఆయాలు 793 మంది ఉండగా, ఆయా పోస్టులు 283 ఖాళీగా ఉన్నాయి. గతంలో అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలన్న నిబంధన ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్, ఆయా పోస్టులకు విద్యార్హతను పెంచింది. అంగన్‌వాడీ టీచర్‌తో పాటు ఆయాలుగా ఉద్యోగాలకు నియమితులయ్యే వారు కనీసం ఇంటర్ ఉత్తీర్ణత ఉండాలని అని నిబంధన పెట్టింది. వయో పరిమితి 18-25 ఏండ్ల మధ్య ఉండాలి. 65 ఏండ్లు దాటిన తర్వాత వారి సేవలను వినియోగించుకోకూడదు. ఖాళీల్లో 50 శాతం ఆయాలకు ఉద్యోగోన్నతి కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది.
Tags
- anganwadi jobs 2025
- anganwadi vacancy 2025 in telangana
- TS Anganwadi Recruitment 2025
- telangana anganwadi recruitment 2025
- anganwadi recruitment 2025 apply online
- anganwadi jobs
- anganwadi jobs news in telugu
- ap anganwadi jobs news in telugu
- TS Anganwadi jobs news in Telugu
- Anganwadi jobs news in telugu states
- Today Anganwadi jobs news in telugu
- anganwadi teacher qualification and age
- anganwadi teacher qualification and age news in telugu
- anganwadi teacher qualification in telangana
- anganwadi teacher qualification in telangana news in telugu
- ts anganwadi notification 2025
- breaking news ts anganwadi jobs notification 2025 issues
- breaking news ts anganwadi jobs notification 2025 issues news in telugu