TS New Government Jobs 2025 : రెవెన్యూ శాఖలోని కొత్తగా 10,954 ఉద్యోగాల భర్తీకి ఆమోదం... ఇంకా గురుకులాల్లో కూడా...!

ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాబినెట్ నిర్ణయం మేరకు.. జీపీఓ పేరుతో 10,954 పోస్టుల భర్తీకి ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. గతంలో వీఆర్వోలుగా పనిచేసి, ప్రస్తుతం వివిధ శాఖల్లో ఉన్న 6,000 మందిని జీపీఓలుగా నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అదనంగా 4,000కు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు రానున్నాయి.
ఇంక కొత్తగా రానున్న ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవే...
మహిళా శిశు సంక్షేమ శాఖలో 6,399 అంగన్‌వాడీ టీచర్, 7,837 హెల్పర్ పోస్టులు త్వరలో నోటిఫికేషన్లు రానున్నాయి. మొత్తం మీద 14,236 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైలుపై మంత్రి సీతక్క సంతకం చేశారు. ఇంకా అదనంగా 228 పోస్టుల భర్తీకి కూడా ప్రణాళిక సిద్ధమవుతోంది.
గ్రూప్-1, 2, 3లో ఎంపికైన 2,711 మందికి..
గ్రూప్-1, 2, 3లో ఎంపికైన 2,711 మందికి త్వరలో నియామక పత్రాలు ఇవ్వనున్నారు. 15 నెలల్లో 61,579 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ప్రజలకు చూపించాలని రేవంత్ సర్కారు బలంగా లక్ష్యంగా పెట్టుకుంది. రానున్న ఉద్యోగ నోటిఫికేషన్లలో గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను కూడా చేర్చి భర్తీ చేయాలని సర్కారు ప్లాన్ చేస్తోంది.
ఉగాది తర్వాత ఉద్యోగాల పండగే...!
మొత్తం 61,579 పోస్టుల జాబితాను సిద్ధం చేసిన ప్రభుత్వం..., ఉగాది తర్వాత 55,418 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వరుసగా విడుదల చేయనుంది.
జాబ్ క్యాలెండర్ ప్రకారం.. 55,418 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసి భర్తీ చేస్తే, మొత్తం 1.16 లక్షల ఉద్యోగాల ప్రక్రియ పూర్తవుతుంది.
గురుకులాల్లో సుమారు 30,228 ఖాళీలను..
తెలంగాణ గురుకులాల్లో సుమారు 30,228 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. ఇందుకోసం ఆర్థిక శాఖతో చర్చలు జరిపిన అధికారులు.., త్వరలో శాఖల వారీగా నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. ఈ ప్రక్రియ ద్వారా నిరుద్యోగ యువతకు ఉగాది నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ల పండుగను అందించాలని తెలంగాణ ప్రభుత్వం బలమైన సంకల్పంతో ఉంది.
Tags
- ts vro jobs 2025
- Good News for TS VRA Jobs
- ts vra jobs 2025
- ts vra jobs 2025 news in telugu
- vro jobs news
- VRO Jobs
- TS VRO jobs
- telangana vro jobs
- vro jobs notification in telangana
- telangana vro and vra jobs notification release
- telangana vra jobs regularization
- roles and responsibilities of VRA jobs
- vra jobs 2025 in ts
- telangana new govt jobs
- telangana new govt jobs news in telugu
- telangana new government jobs 2025
- telangana new government jobs 2025 notification
- ts gurukulam jobs notifications 2025
- ts anganwadi jobs
- TS Anganwadi jobs news in Telugu
- breaking news ts anganwadi jobs notification 2025 issues
- breaking news ts anganwadi jobs notification 2025 issues news in telugu
- ts anganwadi jobs 2025