Skip to main content

Telangana VRO and VRA Jobs Notification 2024 : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. కొత్త నోటిఫికేషన్ ద్వారా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. 10,954 గ్రామాల్లో వీఆర్వోలు, వీఆర్ఎల వ్య‌వ‌స్థ‌ను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
UnemploymentInTelangana  TS CM Revanth Reddy  Telangana Chief Minister Revanth Reddy announces new job opportunities  State government plans to restore VROs and VRAs in villages

ఈ మేర‌కు రాష్ట్రంలో రద్దు అయిన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించడానికి ప్రభుత్వం సిద్ధం అయింది. అందుబాటులో ఉండే గ్రామ రెవెన్యూ అధికారి లేదా గ్రామ రెవెన్యూ సహాయక అధికారులుగా పని చేసిన వారిని వినియోగించుకోవాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

☛➤  TS Constable and SI Jobs Notification 2024 Date : 15000ల‌కు పైగా కానిస్టేబుల్‌, ఎస్ఐ ఉద్యోగాలు నోటిఫికేష‌న్.. ఎప్పుడంటే..? ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..!

☛➤ 11000 Anganwadi Jobs Notification 2024 : భారీ గుడ్‌న్యూస్‌.. 11000 అంగన్‌వాడీల ఉద్యోగాల‌కు నోటిపికేష‌న్‌.. త్వ‌ర‌లోనే.. పోస్టుల భ‌ర్తీ ఇలా..!

కొత్త నోటిఫికేషన్ ద్వారా..
అభ్యర్థులు లేని సమయంలో కొత్త నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని ప్రణాళిక చేస్తున్నట్లు సమాచారం. కనీస విద్యార్హతను నిర్ధారించే క్రమంలో వీఆర్వోలు, వీఆర్ఎలుగా పనిచేసిన 15000 మందికి పైగా పరీక్ష రాసేందుకు అర్హత సాధిస్తారని, వీరిలో పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి అవకాశం కల్పించగా మిగిలిన పోస్టులను కొత్త నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసే యోచనలో ఉన్నట్లు రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

➤ Telangana Job Calendar 2024 Released : గుడ్‌న్యూస్‌.. జాబ్‌ కేలండర్ విడుద‌ల‌.. భర్తీ చేయ‌నున్న పోస్టులు ఇవే..!

Published date : 26 Aug 2024 12:35PM

Photo Stories