Skip to main content

Telangana Job Calendar 2024 Released : గుడ్‌న్యూస్‌.. జాబ్‌ కేలండర్ విడుద‌ల‌.. భర్తీ చేయ‌నున్న పోస్టులు ఇవే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎట్ట‌కేల‌కు..తెలంగాణ ప్ర‌భుత్వం అసెంబ్లీ వేదిక‌గా జాబ్‌ కేలండర్‌ను విడుద‌ల చేశారు. ఇందులో ఉద్యోగాల సంఖ్య ఉండ‌ద‌ని.. నోటిఫికేష‌న్ విడుద‌ల చేసే స‌మ‌యంలోనే పోస్టుల సంఖ్య వెల్ల‌డిస్తామ‌ని.. తెలంగాణ డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు.
deputy cm bhattivikramarka announced job calender Various posts job calender announcement Telangana Job Calendar 2024 job calender announced by telengana government

ఇది కేవ‌లం ప్ర‌క‌ట‌న మాత్ర‌మే అని.. దీనిపై చ‌ర్చ ఉండ‌ద‌ని అసెంబ్లీలో భ‌ట్టీ స్ప‌ష్టం చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు సార్లు గ్రూప్ 1 ఎగ్జామ్ రద్దు అయిందని, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ గందరగోళంగా మార్చారని  భట్టి విక్రమార్క  ఆరోపించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీనియర్ ఐఏఎస్ లతో రెండు కమిటీలు ఏర్పాటు చేసి, వారి సూచనల్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

తెలంగాణ జాబ్‌ క్యాలెండర్ 2024 ప్రకారం తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌ ఆధ్వర్యంలో గ్రూప్‌-1 పరీక్షలు అక్టోబరులో, గ్రూప్‌-2ను డిసెంబరులో, గ్రూప్‌-3 నవంబరులో నిర్వహించనున్నారు.ఇక వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్ నియామకాల కోసం సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేయ‌నున్నారు. వీటికి నవంబర్‌లో పరీక్షలు నిర్వ‌హించ‌నున్నారు.ట్రాన్స్‌కోలోని వివిధ ఇంజినీరింగ్ ఉద్యోగాల కోసం అక్టోబర్‌లో నోటిఫికేషన్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. వీటికి వచ్చే ఏడాది జనవరిలో నియామక పరీక్షలు నిర్వ‌హించ‌నున్నారు. సింగరేణిలో పలు ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జులైలో నోటిఫికేషన్ ఇచ్చి.. నవంబర్‌లో పరీక్షలు నిర్వ‌హించ‌నున్నారు.

డీఎస్సీ, టెట్‌ను.. 
మ‌రో సారి నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వ‌హించ‌నున్నారు. వివిధ శాఖల్లో గెజిటెడ్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జనవరిలో నోటిఫికేషన్ విడుదల ఇచ్చి.. ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వ‌హించ‌నున్నారు. అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మ‌రోసారి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి .. ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వ‌హించ‌నున్నారు.  

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ను ఇచ్చి .. వీటికి మేలో పరీక్షలు నిర్వ‌హించ‌నున్నారు. గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్ష వచ్చే ఏడాది జులైలో నిర్వహించనున్నారు.

ఇక పోలీసు ఉద్యోగాలు మాత్రం..
తెలంగాణ ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తారు. 

గ్రూప్‌-2,3 ప‌రీక్ష‌లకు నోటిఫికేష‌న్‌..
డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు వచ్చే ఏడాది జూన్‌లో నోటిఫికేషన్ ఇచ్చి..సెప్టెంబర్‌లో పరీక్షలు నిర్వ‌హించ‌నున్నారు. వచ్చే ఏడాది మేలో మరోసారి గ్రూపు2 నోటిఫికేషన్ ఇచ్చి.. అక్టోబర్‌లో పరీక్షలు నిర్వ‌హించ‌నున్నారు.  అలాగే వచ్చే ఏడాది జులైలో గ్రూప్‌-3 నోటిఫికేషన్ విడుద‌ల చేసి.. నవంబర్‌లో పరీక్షలు నిర్వ‌హించ‌నున్నారు.

పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి, 60 కొత్త పోస్టులతో మొత్తం 563 పోస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ కు 3 లక్షల మంది హాజరుకాగా, పరీక్ష సజావుగా నిర్వహించి ఫలితాలు ప్రకటించామన్నారు. అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఒక లక్షా 45 వేల 368 మంది హాస్టల్ వేల్ఫెర్ ఆఫీసర్ పరీక్షలకు, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఎగ్జామ్ కు 1 లక్షా 6 వేల 2 వందల 60 మంది హాజరుకాగా, విజయవంతగా నిర్వహించాం. 32 వేల 4 వందల 10 మందికి ఉద్యోగ నియామక ఉత్తర్వులు జారీ చేశాం. అదనంగా 13,500 ఉద్యోగ ఖాళీల భర్తీకి అనుమతులు ఇచ్చాం. 

11 వేల 62 ఖాళీలతో టీచర్ రిక్రూట్ మెంట్ కోసం డీఎస్సీ ఎగ్జామ్ ప్రకటించామ‌న్నారు. జులై 18న ప్రారంభమై ఆగస్టు 5న ముగియనున్నాయి. 465 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఖాళీల భర్తీకి, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ లో 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాం. పరీక్షల ప్రిపరేషన్ కు తగినంత సమయం లేదని అభ్యర్థులు కోరడంతో ఆగస్టు నుంచి డిసెంబర్ కు గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేశాం. పరీక్షా తేదీలు ఒకటే కాకుండా, పరీక్షల మధ్య ప్రిపరేషన్ కు సమయం ఉండేలా అన్ని నియామక బోర్డులు ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నాయని’ అసెంబ్లీలో భట్టి విక్రమార్క ప్రకటించారు.

గత ప్రభుత్వం నిర్వహించిన నియామక పరీక్షల పేపర్లు లీకయ్యాయి, పేపర్ల అమ్మకంతో పరీక్షలు రద్దయ్యాయి. పేపర్ లీక్ కారణంగా 2023 మార్చి 17న తొలిసారి గ్రూప్ 1 ఎగ్జామ్ రద్దయింది. అభ్యర్థుల బయో మెట్రిక్ తీసుకోని కారణంగా హైకోర్టులో రెండోసారి ఎగ్జామ్ రద్దు అయింది. ప్రస్తుతం ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నిరుద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నాం. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి, కొత్త చైర్మన్ ను నియమించి వరుసగా పోస్టుల భర్తీని పూర్తి చేశాం. పాత నోటిఫికేషన్లను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్లు విడుదల చేసి, ఎగ్జామ్స్ సజావుగా నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తున్నామని’ భట్టి విక్రమార్క తన ప్రసంగంలో పేర్కొన్నారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ Group-1,2,3,4 :  స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

ఇకపై ఏటా యూపీఎస్సీ తరహాలో ప్రణాళికాబద్ధంగా తేదీలవారీగా ఉద్యోగ నియామకాల ప్రకటనలు జారీ చేయనుంది. మేని ఫెస్టోలో ప్రకటించిన జాబ్‌ కేలండర్‌కు చట్టబద్ధత కల్పించడానికి శాసనసభలో ప్రకటిస్తున్నామని పొంగులేటి తెలిపారు.  ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు జారీ చేసిన తీర్పును ఇప్పటికే ప్రకటించిన గ్రూప్‌–1, గ్రూప్‌–2, గ్రూప్‌–3 నోటిఫికేషన్లకు వర్తింపజేసేందుకు త్వరలో ఆర్డినెన్స్‌ తీసుకురావాలని సీఎం నిర్ణయించినట్లు చెప్పారు.

Published date : 02 Aug 2024 07:01PM

Photo Stories