Skip to main content

Teqball Championships: టెక్‌బాల్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు తొలి పతకం

టెక్‌బాల్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌-2024లో భారత్‌కు తొలి పతకం లభించింది.
India Secure Historic First Medal In Teqball Championships  Anas Baig and Declan Gonsalves with their bronze medals at the Techball World Championships 2024

పురుషుల డబుల్స్‌ విభాగంలో అనాస్‌ బేగ్‌, డెక్లన్‌ గొంజాల్వెస్‌ జోడీ కాంస్య పతకం కైవసం చేసుకుంది.  

తృటిలో స్వర్ణం రేసు నుంచి తప్పుకున్న భారత జోడీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. బేగ్‌-గొంజాల్వెస్‌ జోడీ సెమీఫైనల్లో పటిష్టమైన థాయ్‌లాండ్‌ జోడీ చేతిలో ఓటమిపాలైంది. టెక్‌బాల్‌లో పతకం సాధించిన 11వ దేశంగా భారత్‌ రికార్డుల్లోకెక్కింది.

వియత్నాం తొలిసారి నిర్వహించిన టెక్‌బాల్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఐదు విభిన్న విభాగాల్లో 95 దేశాల నుంచి 221 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.   

World Chess Championship: 18 ఏళ్లకే వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన భారత గ్రాండ్‌మాస్టర్ గుకేశ్‌.. ప్రైజ్‌ మనీ ఎంతంటే..

టెక్‌బాల్‌ అంటే.. 
టెక్‌బాల్‌ అనేది సెపక్ తక్రా మరియు టేబుల్ టెన్నిస్ అంశాలతో కూడిన క్రీడ. ఈ క్రీడను కర్వ్‌డ్‌ (వంగిన) టేబుల్‌పై ఆడతారు. ఈ క్రీడలో ఆటగాళ్ళు చేతులు మినహా మిగతా అన్ని శరీర భాగాలను వాడతారు. ఈ క్రీడలో ఫుట్‌బాల్‌ తరహా బంతిని వాడతారు. టెక్‌బాల్‌ను సింగిల్స్ లేదా డబుల్స్ గేమ్‌గా ఆడవచ్చు. 

ఈ క్రీడ 2014లో పరిచయం చేయబడింది. ఈ క్రీడ అంతర్జాతీయ టెక్‌బాల్ ఫెడరేషన్ (FITEQ) ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించబడుతుంది. ప్రపంచ స్థాయి ఫుట్‌బాల్ ఆటగాళ్లు ఈ క్రీడ పట్ల ఆకర్షితులవుతున్నారు.

Divith Reddy: ప్రపంచ క్యాడెట్ చెస్ చాంపియన్‌గా అవతరించిన హైదరాబాద్ కుర్రాడు

Published date : 14 Dec 2024 02:45PM

Photo Stories