Skip to main content

Good News for Unemployees : నిరుద్యోగుల‌కు రేవంత్ స‌ర్కార్ మ‌రో శుభ‌వార్త.. వ‌చ్చే ఏడాది మ‌రో డీఎస్సీ!

గ‌త సంవ‌త్స‌రంలో అధికారంలోకి వ‌చ్చిన రేవంత్ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎన్నో హామీలు ఇచ్చారు. అందులో ఒక్కొక్క‌టిగా ప్ర‌జ‌లు శుభ‌వార్త‌లు వింటూ వ‌స్తున్నారు. అందులోదే ఈ డీఎస్సీ నోటిఫికేషన్ కూడా. వచ్చే ఏడాది అంటే ఫిబ్రవరి 2025 లో ఈ నోటిఫికేషన్ రానుంది.
Telangana govt announces good news for dsc candidates   Revanth government announces job opportunities for the unemployedMega DSC exam conducted by Revanth government to fill teacher posts February 2025 notification for job opportunities by Revanth government

సాక్షి ఎడ్యుకేష‌న్: రాష్ట్రంలోని విద్యార్థుల విష‌యంలో గ‌త ప్ర‌భుత్వం న‌డిచిన దారికి భిన్నంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం న‌డుస్తోంది. నిరుద్యోగుల‌పై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టిన రేవంత్ స‌ర్కార్‌, అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌తో నోటిఫికేష‌న్ల‌ను జారీ చేసింది. ఇప్ప‌టికే మెగా డీఎస్సీ నిర్వ‌హించిన ప్ర‌భుత్వం వేలాది టీచ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేసింది. అలాగే, వ‌చ్చే సంవ‌త్స‌రం కూడా మ‌రో నోటిఫికేష‌న్‌తో మ‌రికొంద‌రికి ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించ‌నున్న‌ట్లు తెలిపుతూ.. ఫిబ్ర‌వ‌రీలో నిరుద్యోగుల‌కు నోటిఫికేష‌న్ ఉంటుంద‌ని శుభ‌వార్త త‌లిపారు.

Junior College Students : ఇంట‌ర్‌లో ఉత్తీర్ణ‌తకు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం.. సంక‌ల్ప్‌-2025..

గ‌తంలో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఒక్క‌సారి కూడా డీఎస్సీ నిర్వ‌హించ‌లేదంటూ విమ‌ర్శిస్తూ.. రాష్ట్రంలోని నిరుద్యోగుల‌కు ఖాళీగా ఉన్న టీచ‌ర్ పోస్టుల‌తో భ‌ర్తీ చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు తెలంగాణ డిప్యుటీ సీఎం భ‌ట్టీ విక్ర‌మార్క‌. ప్ర‌భుత్వం ఇప్ప‌టికే మెగా డీఎస్సీ పరీక్ష‌తో 11 వేల పోస్టుల‌ను భ‌ర్తీ చేశారు. ఇక మ‌రోసారి ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హించి మ‌రో 6 వేల పోస్టుల‌ను కూడా భ‌ర్తీ చేస్తామ‌ని హామీ ఇచ్చారు భ‌ట్టీ విక్ర‌మార్క‌. ఈ ప‌రీక్ష‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ ను ఫిబ్ర‌వ‌రీ 2025లో విడుద‌ల చేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 09 Dec 2024 12:03PM

Photo Stories