DSC 2024: డీఎస్సీ–2024లో అనర్హులకు హిందీ ఉద్యోగాలు

హిందీ ఉపాధ్యాయుల నియమకాల్లో జిల్లాలో అవకతవకలు జరిగాయని, జీవో ఎంఎస్ నంబరు 25 ప్రకారం లాంగ్వేజ్ పండిట్ హిందీ పోస్ట్‌కు డిగ్రీలో హిందీ ఆప్షనల్ సబ్జెక్ట్ లేదా హిందీ ద్వితీయ భాష ఉన్నట్లయితే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి పీజీ హిందీతోపాటు, హిందీ పండిట్ ట్రైనింగ్, బీఈడీ చేస్తే హిందీ మెథడాలజీ ఉండాలని పేర్కొన్నారు.
చదవండి: DSC Free Coaching: ఉచితంగా డీఎస్సీ కోచింగ్..
జిల్లాలో ఉద్యోగాలు పొందిన కొందరికి అవి లేవన్నారు. తెలంగాణ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ప్రకారం హిందీ విద్వాన్ భూషణ్ మధ్యమ విశారద సర్టిఫికెట్ కోర్సులు డిగ్రీకి సమానం కావన్నారు. అయినప్పటికీ వారికి ఉద్యోగాలిచ్చారని, తద్వారా అర్హులు ఉద్యోగాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో ఇలాగే జరిగితే అనర్హులను గుర్తించి తొలగించారని, జిల్లాలోనూ రీవెరిఫికేషన్ చేసి అర్హులను నియమించాలని కోరారు. అభ్యర్థులు అన్వర్‌పాషా, ప్రవీణ్, రమేశ్, అతుఫ, రిజ్వాన్, రాజు పాల్గొన్నారు.