Skip to main content

TS TET 2025 Results : టెట్-2025 ఫ‌లితాలు.. మ‌రో డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల ఎప్పుడంటే...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ టెట్-2025 ప‌రీక్ష‌లు రాష్ట్రవ్యాప్తంగా ఇటీవ‌లె ముగిసిన విష‌యం తెల్సిందే.
TS TET 2025 Results and DSC 2025 Notification  TS TET Exam Key Release Announcement  DSC Notification for 6000 Posts in February 2025  DSC Exam Dates Scheduled for April 2025

పేపర్‌-1, 2 కలిపి సగటున 2,75,753 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 2,05,278 మంది (74.44 శాతం) ఈ ప‌రీక్ష‌ల‌కు హాజరయ్యారని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు, టెట్‌ ఛైర్మన్‌ ఈవీ నరసింహారెడ్డి తెలిపారు.

➤☛ TS Government Jobs : కొత్త‌గా 450 గ్రూప్‌-1, 700 గ్రూప్-2 పోస్టుల‌తో పాటు.. 6000 డీఎస్సీ, 10000 పోలీసు జాబ్స్‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌... ఎప్పుడంటే...?

జ‌న‌వ‌రి 24వ తేదీన‌..
టీఎస్ టెట్ ప‌రీక్షకు సంబంధించిన 'కీ' ని జ‌న‌వ‌రి 24వ తేదీన విడుదల చేస్తామన్నారు. ఈ కీ పైన అభ్యంతరాలుంటే జ‌న‌వ‌రి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌ లింక్‌ ద్వారా సమర్పించవచ్చని ఆయన సూచించారు. 

డీఎస్సీ నోటిఫికేష‌న్ కూడా....!
అలాగే ఫిబ్ర‌వ‌రి రెండో... లేదా మూడో వారంలో టెట్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. అలాగే టెట్ ఫ‌లితాలు విడుద‌ల అనంత‌రం 6000 పోస్టుల‌కు డీఎస్సీ నోటిఫికేషన్‌ 2025 ఫిబ్రవరి నెల‌లోనే విడుదల చేయ‌నున్నారు. అలాగే ఈ డీఎస్సీ ప‌రీక్ష‌లు కూడా ఏప్రిల్‌లో జ‌ర‌గ‌నున్నాయి.

Published date : 22 Jan 2025 01:30PM

Photo Stories