TS Constable and SI Jobs Notification 2024 Date : 15000లకు పైగా కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలు నోటిఫికేషన్.. ఎప్పుడంటే..? పరీక్షల తేదీలు ఇవే..!
ఈ నేపథ్యంలో ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి.. ఆగస్టులో పరీక్షలు నిర్వహించనున్నారు.. ఎస్ఐ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి. అలాగే కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇంటర్ అర్హత ఉండాలి. తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది.
తెలంగాణలో 15000లకు పైగా ఎస్ఐ, కానిస్టేబుల్, ఇతర పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని.. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెల్సిందే.
➤☛ Gandrathi Satish, SI: ఇంటర్, డిగ్రీలో ఫెయిల్..ఈ కసితోనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా..
పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ పరీక్షల సిలబస్ ఇదే..
➤☛ పోలీస్ కానిస్టేబుల్(సివిల్) ప్రిలిమినరీ పరీక్షలో ఇంగ్లిష్, అర్థమెటిక్, జనరల్‌సైన్స్,భారతదేశ చరిత్ర, భారతదేశ సంస్కృతి,భారత జాతీయోద్యమం, భౌగోళిక సూత్రాలు,భారతదేశ భౌగోళిక శాస్త్రం, పాలిటీ, ఎకానమీ, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు, రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ, తెలంగాణ రాష్ట్ర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ఫైనల్ రాత పరీక్షలో ప్రిలిమినరీ పరీక్షలోని సిలబస్ అంశాలకు అదనంగా పర్సనాలిటీ టెస్ట్‌కు సంబంధించిన విలువలు, సున్నితత్వం, బలహీన వర్గాలు,సామాజిక అవగాహన, భావోద్వేగ తెలివితేటలపై ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్మీడియెట్ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి.
➤☛ TS Police Jobs Events: ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!
➤☛ ఎస్సై (సివిల్/తత్సమానం) ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్థమెటిక్, రీజనింగ్ అంశాలతోపాటు జనరల్ స్టడీస్‌లో జనరల్ సై¯Œ ్స, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు, భారత దేశ చరిత్ర, జాతీయోద్యమం, భౌగోళిక సూత్రాలు, భారతదేశ భౌగోళిక శాస్త్రం, ఇండియన్ పాలిటీ, ఎకానమీ, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.
➤☛ ఎస్సై(సివిల్/ తత్సమానం) ఫైనల్ రాతపరీక్ష పేపర్–1లో ఇంగ్లిష్‌కు సంబంధించి యూసేజ్, వొకాబులరీ, గ్రామర్, కాంప్రహెన్షన్, ఇతర భాషా నైపుణ్యాలపై పదోతరగతి స్థాయిలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అడుగుతారు. డిస్క్రిప్టివ్ విధానంలో లేఖలు రాయడం, నివేదికలు, వ్యాసరూప, రీడింగ్ కాంప్రహెన్షన్‌పై ప్రశ్నలు ఇస్తారు. పేపర్–2లో తెలుగు/ఉర్దూ భాషా పరిజ్ఞానంపై ప్రశ్నలు ఉంటాయి. పేపర్–3లో అర్థమెటిక్, రీజనింగ్‌పై ప్రశ్నలు ఇస్తారు. పేపర్–4 జనరల్ స్టడీస్‌లో జనరల్ సైన్స్, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు, భారతదేశ చరిత్ర, జాతీయోద్యమం, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలు, భారత దేశ భౌగోళిక శాస్త్రం, ఇండియన్ పాలిటీ, ఎకానమీ, వ్యక్తిత్వ పరీక్షకు సంబంధించిన విలువలు, సున్నితత్వం, బలహీన వర్గాలు, సామాజిక అవగాహన, భావోద్వేగ తెలివితేటలు, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు అంశాలపై ప్రశ్నలు వస్తాయి.
➤☛ Inspiring Story: నేను ఎస్‌ఐ అయ్యానిలా.. అమ్మ కూలి పనులు చేస్తూ..
ఇలా చదితే ఉద్యోగం మీదే..
➤☛ అర్థమెటిక్ విభాగం నుంచి సరాసరి, గ.సా.భా., క.సా.గు.,సంఖ్యలు, దశాంశ భిన్నాలు, వర్గమూలాలు–ఘనమూలాలు, సూక్ష్మీకరణలు, నిష్పత్తి–అనుపాతం,భాగస్వామ్యం, వయసులు, శాతా లు, లాభ–నష్టాలు–తగ్గింపులు, సరళ వడ్డీ, చక్రవడ్డీ, మిశ్రమాలు,కాలం–పని, పంపులు–ట్యాంకులు, పనులు–వేతనాలు, కాలం–దూరం, రైళ్లు, పడవలు–ప్రవాహాలు, ఆటలు–పందేలు అంశాలనుంచి ప్రశ్నలను సాధన చేయాలి.
➤☛ ప్యూర్ మ్యాథ్స్ విభాగం నుంచి వైశాల్యాలు, ఘనపరిమాణాలు, రేఖాగణితం, సాంఖ్యక శాస్త్రం,సంభావ్యత,త్రికోణమితి, మాత్రికలు మొదలైన∙అంశాలు ముఖ్యమైనవి. వీటితోపాటు పదోతరగతిలోపు ప్యూర్ మ్యాథ్స్‌ను కూడా చదవాలి.
➤☛ వెర్బల్ రీజనింగ్‌లో కేలండర్‌లు, గడియారాలు, టైమ్ సీక్వెన్స్, నంబర్ టెస్ట్, ర్యాంకింగ్ టెస్ట్, డైరెక్షన్ టెస్ట్, నంబర్ సిరీస్, మిస్సింగ్ నంబర్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ఆల్ఫాబెటికల్ టెస్ట్, కోడింగ్–డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, పజిల్స్ టెస్ట్, సీటింగ్ అరేంజ్‌మెంట్స్, అర్థమెటికల్ రీజనింగ్, అనాలజీ, భిన్నమైన దాన్ని గుర్తించడం తదితర అంశాలు ముఖ్యమైనవి.
➤☛ లాజికల్ రీజనింగ్‌లో లాజికల్ వెన్‌డయాగ్రమ్స్, స్టేట్‌మెంట్స్ అండ్ ఆర్గుమెంట్స్, స్టేట్‌మెంట్స్ అండ్ అసంప్షన్స్, అసర్షన్ అండ్ రీజన్, సిల్లోజియం, డేటా సఫిషియెన్సీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్ అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి.
➤☛ నాన్‌వెర్బల్ రీజనింగ్‌లో క్యూబ్స్ అండ్ డైస్, సిరీస్, అనాలజీ, భిన్నమైన దాన్ని గుర్తించడం, మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, కంప్లీషన్ ఆఫ్ ఫిగర్స్, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కట్టింగ్, కౌంటింగ్ ఫిగర్స్ మొదలైనవి ముఖ్యమైనవి.
పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ పరీక్ష విధానం ఇలా...
సబ్ ఇన్‌స్పెక్టర్స్, పోలీస్ కానిస్టేబుల్స్ పోస్టులకు వేర్వేరుగా అర్హత పరీక్షగా ప్రిలిమినరీ పరీక్షను నిర్వహిస్తారు. దీనిలో 180 నిమిషాల్లో 200 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. 200 మార్కులుంటాయి. నెగెటివ్ మార్కులు ఉండవు. ఇందులో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ అంటే ఎత్తు, ఛాతి, బరువులకు సంబంధించి పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణించరు. ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు.. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ కింద పురుషులకు 100 మీ. పరుగు, 800 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, హైజంప్, షార్ట్‌పుట్ ఈవెంట్స్ నిర్వహిస్తారు. మహిళలకు 100 మీటర్ల పరుగు, షార్ట్ పుట్, లాంగ్ జంప్ ఈవెంట్స్ ఉంటాయి. వీటిలో అర్హత సాధించిన వారిని మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు.
TS Police Exams Best Preparation Tips: పక్కా వ్యూహంతో.. ఇలా చదివితే పోలీస్ ఉద్యోగం మీదే..!
5 కి.మీ. పరుగు స్థానంలో..
పోలీస్ నియామకాల ఎంపిక విధానంలో గతంలో ప్రిలిమినరీ పరీక్షగా 5 కి.మీ. పరుగు పోటీ ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత శారీరక దారుఢ్యంతోపాటు మానసిక సామర్థ్యాలపై ప్రధానంగా దృష్టి సారించారు. 5 కి.మీ. పరుగు స్థానంలో ప్రిలిమినరీ పరీక్షగా రాత పరీక్షను నిర్వహిస్తున్నారు. అయితే 5 కి.మీ.పరుగు తొలగించిన తర్వాత పోలీసు ఉద్యోగాలకు పోటీ పెరిగింది. గ్రూప్స్, డీఎస్సీ, బ్యాంక్స్, రైల్వే అభ్యర్థులు కూడా వీటికి పోటీ పడుతున్నారు. ఎంతైనా గ్రూప్స్, డీఎస్సీ కంటే పోలీసు ఉద్యోగాలు పోటీ తక్కువగానే ఉంటుంది.
పరీక్షలో ఈ మార్కులే కీలకం..
సబ్ ఇన్‌స్పెక్టర్స్ మెయిన్ ఎగ్జామినేషన్‌లో 4 పేపర్లుంటాయి. మొదటి రెండు పేపర్లలో ఇంగ్లిష్, తెలుగు భాషాంశాలపై 100 మార్కుల చొప్పున ప్రశ్నలు ఇస్తారు. ఇవి కేవలం అర్హత పరీక్షలు మాత్రమే. 3, 4వ పేపర్లుగా అర్థమెటిక్–రీజనింగ్, జనరల్ స్టడీస్ అంశాలపై 200 మార్కులకు 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అడుగుతారు. నెగెటివ్ మార్కులు ఉండవు. అర్హత సాధించిన అభ్యర్థుల్లో అర్థమెటిక్–రీజనింగ్, జనరల్ స్టడీస్‌లలోని మొత్తం 400 మార్కుల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. కానిస్టేబుల్స్ మెయిన్ ఎగ్జామినేషన్‌లో 200 మార్కులకు 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో కూడిన ప్రశ్నపత్రం ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉండవు. ఇందులో అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్, ఇంగ్లిష్ సబ్జెక్టులు నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఈ పేపరులో అర్హత సాధించిన అభ్యర్థుల మార్కుల మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
➤☛ Competitive Exams: కోచింగ్ తీసుకోకుండా గ్రూప్స్, ఎస్‌ఐ తదితర పరీక్షల్లో విజయం సాధ్యమా..? కాదా..?
ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల్లో ప్రశ్నల సరళి ఇలా..
గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే.. ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల్లో ప్రశ్నల సరళి కొంచెం కఠినంగానే ఉంది. జనరల్ స్టడీస్‌లో గ్రూప్–2, గ్రూప్–1 స్థాయిలో, అర్థమెటిక్–రీజనింగ్‌లో బ్యాంక్ పరీక్షల స్థాయిలో ప్రశ్నలు అడుగుతున్నారు. ‘జతపరచండి’ తరహాలో ప్రశ్నలు ఇస్తున్నారు. డైరెక్ట్ ప్రశ్నలు కాకుండా.. అనువర్తన ఆధారిత ప్రశ్నలకు ప్రాధాన్యతనిస్తున్నారు. కాబట్టి అభ్యర్థులు కాన్సెప్ట్స్‌తోపాటు షార్ట్‌కట్స్ కూడా నేర్చుకోవాలి. అలా అని కేవలం షార్ట్‌కట్స్‌పైనే ఆధారపడకూడదు. ప్రశ్నలకు ఎలా అడిగినా అభ్యర్థులు సమాధానాలు రాయగలగాలి. కాబట్టి కాన్సెప్ట్‌తో కూడిన షార్ట్‌కట్స్ నేర్చుకోవాలి. ప్రశ్నలను పూర్తిగా అర్థం చేసుకుని చేసే అలవాటు చేసుకోవాలి.
బలం, బలహీనతలను..
పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు.. వారి బలం, బలహీనతలను గుర్తించి వాటిని ముందుగా అధిగమించాలి. దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న పోస్టుకు సంబంధించిన సిలబస్‌ను పూర్తిగా విశ్లేషించుకోవాలి. పరీక్షలో ప్రశ్నల స్థాయి తెలుసుకునేందుకు గత పరీక్షల ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయాలి. కొన్ని సబ్జెక్టులకు వెయిటేజీ ఎక్కువగానూ,కొన్నింటికి వెయిటేజీ తక్కువగానూ ఉంటుంది. అర్థమెటిక్, రీజనింగ్ పేపర్‌లో కూడా ‘జతపరచండి’ తరహా ప్రశ్నలు ఇస్తున్నారు. వాటిని సాధించడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించాలంటే.. గుణింతాలు,వర్గాలు, ఘనాలు క్రమం తప్పకుండా సాధన చేయాలి. అప్పుడే కాలిక్యులేషన్స్ వేగంగా చేయగలుగుతారు.నిర్ణీత సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయగలుగుతారు.
GK & Current Affairs: పోలీసు ఉద్యోగాల రాతపరీక్షలో.. కరెంట్ అఫైర్స్, జీకే పాత్ర..
వీటి ఆధారంగానే...
పోలీస్ ఉద్యోగాల అభ్యర్థులు చదివిన అంశాలను ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకోవాలి. రోజుకు ఒకసారి, వారంలో, నెలలో మరోసారి సమయం కేటాయించుకోవాలి. అలాగే పరీక్షకు ముందు నేర్చుకున్న అంశాలను తప్పనిసరిగా రివిజన్ చేసుకోవాలి. సిలబస్‌లోని అన్ని అంశాలను చదివిన తర్వాత గ్రాండ్‌టెస్ట్‌లు రాయాలి. వాటి ఫలితాల ఆధారంగా స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. తప్పులను సరిదిద్దుకోవాలి. అభ్యర్థులు పరీక్షల్లో విజయం సాధించాలంటే ప్రాక్టీస్ ప్రధానం. సాధన చేస్తే విజయం తప్పక వరిస్తుంది. కాబట్టి విశ్వాసంతో పరీక్షలకు సన్నద్ధమవ్వాలి.
Tags
- TS Police Constable Jobs
- TS Police Constable Jobs 2024 Notification Release Date
- telangana constable and sub inspector jobs 2024
- telangana constable and sub inspector jobs 2024 news telugu
- telugu news telangana constable and sub inspector jobs 2024
- ts constable notification 2024
- ts constable notification 2024 date and time
- ts constable jobs recruitment 2024
- ts constable jobs recruitment 2024 date
- ts constable jobs recruitment 2024 process
- ts constable jobs recruitment 2024 process date and time
- ts constable jobs recruitment 2025 process date and time
- ts job calendar 2024
- ts si jobs 2025 notification released date
- ts si jobs 2025 notification release news telugu
- ts constable jobs 2025 notification
- ts constable jobs 2025 notification news telugu
- telugu news ts constable jobs 2025 notification
- ts constable notification 2024 apply online
- ts constable notification 2025 age limit
- ts police constable age limit 2025
- TSLPRB Recruitment 2025 Overview
- ts police constable eligibility
- ts police SI eligibility
- ts police SI eligibility news telugu
- telugu news ts police SI eligibility
- ts police SI eligibility details in telugu
- TelanganaPoliceJobs
- PoliceRecruitment2024
- TelanganaGovernmentJobs
- PoliceVacancies2024
- Congress government recruitment
- TelanganaJobNotifications
- PoliceRecruitmentUpdates
- TelanganaPolicePosts
- latest jobs in 2024
- sakshieducation latest job notifications in 2024