Skip to main content

Gandrathi Satish, SI: ఇంటర్, డిగ్రీలో ఫెయిల్..ఈ క‌సితోనే మూడు ప్ర‌భుత్వ ఉద్యోగాలు కొట్టానిలా..

కృషి ఉంటే మనుషులు రుషులవుతారనే నానుడిని నిరూపించారు ఎస్సై గండ్రాతి సతీష్‌. ఇంటర్‌, డిగ్రీలో ఫెయిల్‌ అయినా ధైర్యం కోల్పోకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకు సాగారు..
SI Gandrathi Satish
SI Gandrathi Satish

ప్రభుత్వ ఉద్యోగంలోనైతే ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం ఉంటుందని నిర్ణయించుకుని కష్టపడి చదివారు.. తద్వారా ఒకటి కాదు రెండు కాదు మూడు ఉద్యోగాలకు ఎంపికైన ఆయన చివరకు ఎస్సై పోస్టును ఎంచుకుని కొనసాగుతున్నారు.

కుటుంబ నేప‌థ్యం : 
ప్రస్తుత భద్రాద్రి జిల్లా పినపాక మండలంలోని ఏడూర్ల బయ్యారం గ్రామానికి చెందిన మధ్య తరగతి రైతు కుటుంబంలో సతీష్‌ జన్మించారు. ఆయన తల్లిదండ్రులైన గండ్రాతి వెంకటరమణ – సమ్మయ్యకు ముగ్గురు కుమారులు. ఇద్దరు కుమారులు వ్యవసాయం చేస్తుండగా.. చిన్న కుమారుడైన సతీష్‌ను చదివించి ప్రభుత్వ ఉద్యోగస్తుడిగా చూడాలని ఆ తల్లిదండ్రుల కోరిక. 

అర‌కొర మార్కుల‌తో..
10వ తరగతిలో సాధారణ మార్కులతో ఉత్తీర్ణత సాధించిన ఆయన ఇంటర్‌లో చేరాడు. ఇంటర్‌లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఫెయిలయ్యాడు. అయినా తల్లిదండ్రులు చదువు కొనసాగించాలని ప్రోత్సహించడంతో సప్లమెంటరీ పరీక్షలు రాసి పాసయ్యాక డిగ్రీలో చేరాడు. అయితే, డిగ్రీలో కూడా ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఫెయిలయ్యాడు. చివరకు మూడో సంవత్సరంలో అన్ని పరీక్షలు రాసి సాధారణ మార్కులతో గట్టెక్కాడు.

ఆ వీఆర్వో చాలా దారుణంగా...
ఒకసారి ఆదాయ ధృవీకరణ సర్టిఫికెట్‌ కోసం సతీష్‌ వీఆర్వో వద్దకు వెళ్లాడు. అయితే, ఆ పని చేయకపోవడమే కాకుండా జులుం ప్రదర్శించడంతో సతీష్‌ ఆవేదన చెందాడు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించి తనకు ఎదురుపడిన వీఆర్వో మాదిరిగా కాకుండా ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఊరికి దూరంగా హైదరాబాద్‌ వెళ్లాడు. ఒకసారి ఎస్‌ఐ ఉద్యోగానికి పరీక్ష రాస్తే అవకాశం దక్కలేదు. అయినా నిరుత్సాహానికి గురికాకుండా పోటీ పరీక్షలకు అవసరమైన సబ్జెక్టులపై పట్టు సాధించేలా చదివాడు. అలా రెవెన్యూలో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగంతో పాటు డిప్యూటీ జైలర్‌ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ఇందులో డిప్యూటీ జైలర్‌ ఉద్యోగాన్ని ఎంచుకోగా ఖమ్మంలో పోస్టింగ్‌ లభించింది. అయితే, ఆరు నెలల పాటు ఉద్యోగం చేశాక ప్రజలకు సేవల చేయాలంటే ఇది సరైన ఉద్యోగం కాదనుకున్న సతీష్‌ మళ్లీ ఎస్సై రాతపరీక్ష రాసి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఆయన ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు.
 
ఉద్యోగం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు..కానీ
ఇంటర్‌లో ఫెయిలైనప్పుడు నన్ను తల్లిదండ్రులు తిడతారనుకున్నాను. కానీ ధైర్యం చెప్పి చదువు కొనసాగించేలా ప్రోత్సహించారు. ఉద్యోగం సంపాదించాలనే తల్లిదండ్రుల కోరికతో పాటు నా లక్ష్యం సాధించాను. చదువుపై ఆసక్తిని పెంచుకుని ఆత్మవిశ్వాసంతో చదివితే ఉన్నత ఉద్యోగాలు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇదే సమయంలో లక్ష్యాన్ని ఎంచుకోవడం, దాని చేరుకునేందుకు కష్టపడడం కూడా ముఖ్యమే.            – గండ్రాతి సతీష్, ఎస్‌ఐ, పాలకుర్తి 
 
85 ఏళ్ల వృద్ధురాలికి సొంత ఖర్చులతో.. 

85 ఏళ్ల వృద్ధురాలికి సొంత ఖర్చులతో.


ఓ వృద్ధురాలికి అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామంలో బండిపల్లి రాజమ్మ అనే నిరుపేద వృద్ధురాలికి తన సొంత ఖర్చులతో ఇళ్లు కట్టించి ఇచ్చారు. 85 ఏళ్ల రాజమ్మ భర్త మృతి చెందాడు. కొడుకు దివ్యాంగుడు.. చేదోడు వాదోడుగా ఉన్న కోడలు అనారోగ్యంతో మృతి చెందింది. ఓ చిన్న గుడెసెలో కొడుకు, మనవరాలితో ఉంటూ.. కూలీ పనులకు వెళ్తూ వచ్చిన పైసలతో పోషించుకుంటోంది. కొద్ది రోజుల కిందట పాము కాటుతో మనవరాలు చనిపోయింది. గత ఆగస్టులో వర్షాలకు గుడిసె కూలిపోయింది. ఇలా పుట్టెడు కష్టాలతో రెక్కలు ముక్కలు చేసుకుంటున్న వృద్ధురాలి విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సతీష్‌ తీవ్రంగా చలించిపోయారు. రోడ్డున ఆమెకు అండగా ఉండాలి అనుకున్నాడు. వెంటనే ఆ వృద్ధురాలికి ఇళ్లు కట్టించి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తన సొంత డబ్బులు రూ.2 లక్షలతో ఇళ్లు కట్టించారు.

SI Raja Ravindra : ఎప్ప‌టికైన‌ నా స్వప్నం ఇదే..దీని కోసం..

 

DSP Snehitha : గ్రూప్‌–1కు సెలక్టయ్యానిలా...ముగ్గురం ఆడపిల్లలమే..అయినా

Y.Obulesh, Group 1 Ranker : ప్ర‌భుత్వ స్కూల్‌లో చ‌దివా...ప్ర‌భుత్వ ఉద్యోగం కొట్టానిలా..

గ్రూప్‌–1 కిరీటం.. రాష్ట్రస్థాయిలో ఫ‌స్ట్ ర్యాంక్‌.. ఆర్‌టీఓగా ఉద్యోగం

Group-2 Job:మొదటి ప్రయత్నంలోనే విజయం..గ్రూపు–2లో ఉద్యోగం..ఎలా అంటే..

గ్రూప్‌–1 కిరీటం.. రాష్ట్రస్థాయిలో ఫ‌స్ట్ ర్యాంక్‌.. ఆర్‌టీఓగా ఉద్యోగం

గ్రూప్‌–1 లో విజ‌యం సాధించానిలా..: హరిత, ఆర్డీఓ

Group 1 Ranker: ఆన్‌లైన్‌ కోచింగ్‌..గ్రూప్‌–1 ఉద్యోగం

DSP Yegireddi Prasad Rao : ఆయ‌న కష్టాలను కళ్లారా చూశాడు..డీఎస్పీ అయ్యాడు..

Published date : 17 Dec 2021 12:48PM

Photo Stories