Skip to main content

SI Raja Ravindra : ఎప్ప‌టికైన‌ నా స్వప్నం ఇదే..దీని కోసం..

కొత్తగూడెం ప‌ట్టణానికి చెందిన స‌బ్ ఇన్‌స్పెక్టర్ బీ రాజార‌వీంద్ర ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో పాల్గొన్న సంగతి మనకు తేలిసిందే.
SI Raja Ravindra
SI Raja Ravindra

ఈ షోలో జూనియర్ ఎన్టీఆర్ అడిగిన 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి కోటి రూపాయ‌లు గెలుచుకున్నారు. అనుకోకుండానే కార్యక్రమానికి హాజరై చరిత్ర సృష్టించిన ఈ కోటీశ్వరుడు న‌వంబ‌ర్‌15వ తేదీన‌ రాత్రి 8:30 గంటలకు టీవీలో ప్రసారమైన కార్యక్రమంలో చెక్కు అందుకున్నారు. ఖమ్మం జిల్లా సుజాతనగర్‌ ప్రాంతానికి చెందిన రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి బి.వి.ఎస్‌.ఎస్‌ రాజు, శేషుకుమారి దంపతుల సంతానం రవీంద్ర. రవీంద్రకు భార్య సింధూజ, కుమారుడు దేవాన్‌ కార్తికేయ, కూతురు కృతి హన్విక ఉన్నారు. 

నేను..నా ఉద్యోగాలు

Evaru Meelo Koteeswarulu


2000 – 2004 మధ్య హైదరాబాద్‌లోని వజీర్‌ సుల్తాన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చేశారు. ఇది వరకు సాఫ్ట్‌వేర్, బ్యాంకు, ఇతర ఉద్యోగాలు సాధించారు. దేశం తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొనడమే లక్ష్యంగా 2012లో పోలీస్‌ శాఖలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం సంపాదించారు. హైదరాబాద్‌లోని సీఐడీ సైబర్‌ క్రైంలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రవీంద్ర పిస్టల్, ఎయిర్‌ రైఫిలింగ్‌లోనూ దిట్ట. ఈ సందర్భంగా రవీంద్రను ‘సాక్షి’ ఫోన్‌లో పలకరించింది. వివరాలు ఆయన మాటల్లోనే..

ఎప్ప‌టికైన నా కల ఇదే..
గతంలో సివిల్స్‌కు సిద్ధమై ఉండటం నా గెలుపునకు తోడ్పడింది. ఒలింపిక్‌ క్రీడల్లో ఇండియా తరఫున పాల్గొని స్వర్ణ పతకం సాధించడం నా కల. ఇప్పటికే జాతీయ స్థాయి పోలీసు క్రీడాపోటీల్లో తెలంగాణ తరఫున పాల్గొని రెండుసార్లు బంగారు, రజతం, ఒకసారి కాంస్య పతకాలు సాధించాను. 2017 తెలంగాణ స్టేట్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో, అదే ఏడాది గుహవాటిలో జరిగిన జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో బంగారు పతకాలు కైవసం చేసుకున్నా. 2019లో జరిగిన ఆలిండియా పోలీస్‌ పిస్టల్‌ విభాగం పోటీల్లో రజతం సాధించా. వచ్చిన రూ.కోటితో నాణ్యమైన శిక్షణ పొందుతా. నాలాగా అవసరం ఉన్నవారికీ సహకరిస్తాను.

ప్ర‌శ్నలు ఇలా..
రాజా రవీంద్రను హాట్ సీట్‌కి తీసుకెళ్లిన ప్రశ్న.. 
హైదరాబాద్ నుంచి వాటి దూరాల ప్రకారం, ఈ నగరాలను తక్కువ నుంచి ఎక్కువకు అమర్చండి?
A) న్యూయార్క్  
B) ముంబయి  
C) దుబాయ్  
D) విజయవాడ
ప్రశ్న చదవగానే సమాధానం అందరికీ తెలిసినట్టు అనుకున్నా హాట్‌సీట్‌పై కూర్చొని తక్కువ సమయంలోనే సరైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఫాస్టెస్ట్‌ ఫింగర్‌ ఫస్ట్‌కు తొలి ప్రాధాన్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇందులో రాజా రవీంద్ర కేవలం 2.637 సెకన్లలోనే సమాధానం ఇచ్చి హాట్‌సీట్‌ను చేరుకున్నారు. ఇక​ అక్కడ నుంచి ఆయన వరుసగా సరైన సమాధానాలు చెప్తూ ఎన్టీఆర్‌ను సైతం ఆకట్టుకున్నారు.

న‌వంబ‌ర్ 15వ తేదీన‌ ప్రసారమైన ప్రోగ్రాంలో.. ఆయన 12 ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఉన్న మూడు లైఫ్‌ లైన్లలో కేవలం ఒక్క దానిని మాత్రమే ఉపయోగించుకొని రూ.12,50,000 గెలుచుకున్నారు. కోటి రూపాయలు గెలుచుకోవడానికి మరో మూడు ప్రశ్నల దూరంలో నిలిచారు. దీనికి కొనసాగింపుగా న‌వంబ‌ర్ 16వ తేదీన‌ జరిగిన షోలో రాజా రవీంద్ర కోటి రూపాయల వైపు అడుగులు వేసిన ప్రశ్నలను ఒకసారి చూస్తే.. ఆట ప్రారంభం కాగానే జూనీయర్‌ ఎన్టీఆర్‌.. రాజా రవీంద్రను 25 లక్షల రూపాయల ప్రశ్న అడిగారు. ఒక్క లైఫ్‌ లైన్‌ను అప్పటికే ఉపయోగించడం వల్ల ఇక రెండు మాత్రమే యాక్టివ్‌లో ఉన్నాయి. 25 లక్షలకు రాజా రవీంద్రను అడిగిన ప్రశ్న..

25 లక్షలకు రాజా రవీంద్రను అడిగిన ప్రశ్న..
2020లో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఏ పదం, ఇటాలియన్‌ భాషలో '40 రోజులు' అని అర్థం వచ్చే ఒక పదం నుంచి వచ్చింది?
A)లాక్‌డౌన్‌
B)ఐసోలేషన్‌
C)క్వారంటైన్‌
D)పాండమిక్
ఈ ప్రశ్నకు చాలాసేపు ఆలోచించిన రాజారవీంద్ర మరో లైఫ్‌ లైన్‌ను ఉపయోగించుకుని క్వారంటైన్‌ అని సరైన సమాధానం చెప్పాడు. దీంతో 50 లక్షల రూపాయల ప్రశ్నకు చేరుకున్నారు. ఈ షోలో పాల్గొని 50 లక్షల ప్రశ్నకు చేరుకున్న అతి తక్కువ మందిలో రాజారవీంద్ర ఒక్కరు. 

50లక్షల ప్రశ్నను పరిశీలిస్తే.. 
జాతీయ వైద్యుల దినోత్సవం ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,వైద్యుడు అయిన ఒక వ్యక్తి జ్ఞాపకార్థం జరుపుతారు?
A) మిజోరాం
B) పశ్చిమబెంగాల్‌
C) ఉత్తరప్రదేశ్‌
D) కేరళ
ఈ ప్రశ్నకు కొద్దిసేపు ఆలోచించి ఆప్షన్‌ బీ అంటూ కాన్ఫిడెంట్‌గా సరైన సమాధానం చెప్పారు. ఇప్పుడు కోటి రూపాయల ప్రశ్న. ఎవరు మీలో కోటీశ్వరులు చరిత్రలోనే ఇద్దరు మాత్రమే కోటి రూపాయల ప్రశ్నను చూశారు. వారిలో ఒకరు సెకండ్‌ సీజన్‌లో అయితే.. ఇప్పడు రాజారవీంద్ర మాత్రమే. 

ఇక కోటి రూపాయల ప్రశ్నను పరిశీలిస్తే.. 

కోటి రూపాయల ప్రశ్న


1956 రాష్ట్రాల పునర్విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు కారణమైన కమిషన్‌కు, ఎవరు అధ్యక్షత వహించారు?
A) రంగనాథ్‌ మిశ్రా
B) రంజిత్‌సింగ్‌ సర్కారియా
C) బీపీ మండల్‌
D) ఫజల్‌ అలీ కమిషన్‌
ఈ ప్రశ్నకు చాలా సేపు థింక్‌ చేసి ఉన్న మరో లైఫ్‌ లైన్‌ ఉపయోగించుకొని ఆప్షన్‌ డీ అంటూ చాలా కాన్ఫిడెంట్‌గా సరైన సమాధానం చెప్పారు. దీంతో ఈఎమ్‌కే చరిత్రలోనే కోటి రూపాయలు గెలుచుకున్న తొలి వ్యక్తిగా రాజా రవీంద్ర నిలిచారు.

Published date : 18 Nov 2021 12:24PM

Photo Stories