Sridhar Vembu Success Story : రూ.28000 కోట్లకు పైగా సంపదకు అధిపతి.. నేటికి సొంత గ్రామంలో సైకిల్‌పైనే..
ఇంకోందరు మాత్రం బాగా సంపాదన రాగానే కొంతమందికి గర్వం వస్తుంది. అంతేకాక ఆస్తి పెరిగే కొద్దీ లగ్జరీ జీవితానికి అలవాటు పడి.. తమ మూలాలను మర్చిపోయి ప్రవర్తిస్తుంటారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛☛ Follow our Instagram Page (Click Here)
ఇప్పటి మనం చెప్పుకునే వ్యక్తి మొదటి రకం చెందినవారు. దాదాపు 28 వేల కోట్ల ఆస్తికి అధిపతి. కానీ ఇప్పటికీ సైకిల్ మీదనే ప్రయణం చేస్తున్నారు. ఇంతకు ఆయన ఎవరు..? ఏమి చేసి ఇంత సంపద సంపాదించారు. ఆయన కుటుంబ నేపథ్యం ఏమిటి..? తెలుసుకోవాలనుకుంటున్నారా...? అయితే ఆయన సక్సెస్ స్టోరీ మీకోసం ప్రత్యేకంగా...
కుటుంబ నేపథ్యం :
ఈయన పేరు శ్రీధర్ వెంబు. ఈయన తమిళనాడులోని తంజావూరులో 1968లో జన్మించారు. ఆయన తండ్రి చెన్నై హైకోర్టులో స్టెనోగ్రాఫర్‌గా పని చేశారు. ఆయన తల్లి గృహిణి.
ఎడ్యకేషన్ :
శ్రీధర్ వెంబు.. ప్రభుత్వ బడిలోనే చదివాడు. ఆయనకు ఐఐటీ జేఈఈ పరీక్షలో జాతీయ స్థాయిలో 27వ ర్యాంకు సాధించారు. ఆ తర్వాత ఐఐటీ మద్రాస్‌లో తన విద్యాభ్యాసం కొనసాగించారు. ఆపై చదువులను ప్రిన్స్టన్ యూనివర్సిటీలో పూర్తి చేశారు. చదువు పూర్తైన వెంటనే 1994లో క్వాల్ కామ్ లో పని చేశారు.
ఆ కోరికతోనే..
అయితే ఆయనకు చిన్నతనం నుంచి ఓ స్టార్టప్ కంపెనీని ప్రారంభించాలని ఆయనకు కోరిక ఉంటేది. అందుకే మంచి జీతం వచ్చే జాబ్ ను వదిలేశారు. అయితే అప్పటికే ఆయన సోదరుడు చెన్నైలో అడ్వెంట్ నెట్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీని నడపుతున్నారు. 2001లో ఆర్థిక మాంద్యం సమయంలో అడ్వెంట్ నెట్ భారీగా నష్టాన్ని చవిచూసింది. ఇది సమయంలో జోహ్ డొమైన్ నేమ్మును శ్రీధర్ వెంబ్ కొనుగోలు చేశారు.
కీలక అడుగు ఇక్కడే పడిందిలా..
2009లో తన కంపెనీలో అడ్వెంట్ నెట్ కంపెనీని విలీనం చేశారు. ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. అంతేకాక 2021 నవంబర్ నాటికి జోహో కంపెనీ ఆదాయం 1 బిలియన్ డాలర్లకు చేరింది. కొవిడ్ టైమ్ లో కూడా ఈ కంపెనీ భారీ లాభాలు పొందింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జోహో కార్పొరేషన్ లాభాలు వృద్ధి చెందుతూనే ఉన్నాయి. అయినా శ్రీధర్ వెంబు సాధారణ జీవన విధానం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఆయన నికర ఆస్తి విలువ 28 వేల కోట్లని అంచనా.
తన స్వగ్రామం ఇప్పటికీ..
ఫోర్బ్స్ డేటా ప్రకారం, భారతదేశంలోని రిచెస్ట్ పర్సన్స్ లిస్ట్ లో శ్రీధర్ వెంబు 55వ స్థానంలో ఉన్నారు. శ్రీధర్ వెంబు సేవలకు పద్మశ్రీ అవార్డు వరించింది. ఇంతటి ఘనత ఉన్నప్పటికీ, శ్రీధర్ వెంబు తన స్వగ్రామం తంజావూరులో నిరాడంబర జీవితాన్ని గడుపుతున్నారు.
సూటు, బూటు కాకుండా తమిళ సంప్రదాయంలో పంచెను ధరిస్తున్నారు. అతి సాధారణ చొక్కాలు ధరిస్తున్నారు. అలానే తన ప్రయాణంకి ఖరీదైన కార్లు కాకుండా.. సైకిల్‌ను మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఆయనకు అలా జీవనం సాగించడమే ఇష్టమంట.
☛ IAS Officer Success Story : ఒక వైపు కరోనాతో తండ్రి మరణం.. మరో వైపు సివిల్స్ ఇంటర్వ్యూ.. చివరికి..
ఎక్కువ మంది కాస్తా డబ్బులు రాగానే అహంకారం పెరుగుతుంది. ఆస్తి పెరిగే కొద్ది లగ్జరీ జీవితానికి అలవాటు పడి.. తమ మూలాలను మర్చిపోతుంటారు. ఇక తమకంటే తోపు ఇంకెవరూ లేరన్నట్లు ప్రవర్తిస్తారు. శ్రీధర్ వెంబ్ అనే ఓ వ్యాపార వేత్త మాత్రం అందరికి ఆదర్శంగా నిలిచారు. వేల కోట్ల ఆస్తి ఉన్నా ఎంతో సాధారణ జీవితం గడుపుతున్నారు. విభిన్నమైన ఆలోచనలతోనే కాదు, నిరాడంబరమైన జీవన విధానంతోనూ ప్రసిద్ధి చెందారు.
Tags
- Sridhar Vembu Success S
- Sridhar Vembu CEO of Zoho Corporation
- sridhar vembu family
- sridhar vembu education
- sridhar vembu family details in telugu
- Sridhar Vembu news in telugu
- Sridhar Vembu Story in Telugu
- Sridhar Vembu Inspire Story
- sridhar vembu net worth 2024
- sridhar vembu net worth 2024 details in telugu
- zoho corporation founders
- sridhar vembu education details in telugu
- zoho founder story
- zoho founder story news telugu
- zoho founder stories in telugu
- sridhar vembu success
- sridhar vembu success stories in telugu
- Sridhar Vembu Inspirational Success Stories