Skip to main content

IAS Officer Success Story : ఒక వైపు కరోనాతో తండ్రి మ‌ర‌ణం.. మ‌రో వైపు సివిల్స్ ఇంటర్వ్యూ.. చివ‌రికి..

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్‌ క‌మిష‌న్ (UPSC) సివిల్స్‌లో స‌క్సెస్ సాధించ‌డం అంతా.. ఈజీ కాదు. దీని కోసం క‌ఠోర శ్ర‌మ ఎంతో అవ‌స‌రం. అలాగే దీనిలో బెస్ట్ ర్యాంక్‌ సాధించడం కోసం ఎంతో మంది కలలుకంటుంటారు.
Divyanshu Nigam IAS Success Story in Telugu
Divyanshu Nigam IAS Success Story

దీని నిజం చేసుకోవడానికి చాలా మంది చేయని ప్రయత్నమంటూ ఉండదు. స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందిన వారు.. లక్నోకు చెందిన దివ్యాన్షు నిగమ్. యూపీఎస్సీ సివిల్స్ ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌దివి.. రెండవ ప్రయత్నంలో సివిల్స్ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.. కానీ ఇంటర్వ్యూకి చేరుకోలేకపోయారు. మూడవ ప్రయత్నంలో గ‌ట్ట‌గా ప‌ట్టుప‌ట్టి చ‌దివి.. యూపీఎస్సీ సివిల్స్ ఫ‌లితాల‌లో జాతీయ స్థాయిలో 44వ ర్యాంకు సాధించాడు. చివ‌రికి త‌న ఐఏఎస్ (IAS) కల సాధించాడు. ఈ నేప‌థ్యంలో యువ ఐఏఎస్ ఆఫీస‌ర్ దివ్యాన్షు నిగమ్ స‌క్సెస్ స్టోరీ మీకోసం..

☛ IPS Success Story : ఓ 22 ఏళ్ల యువకుడు.. ఎలాంటి కోచింగ్ లేకుండానే.. తొలి ప్రయత్నంలోనే.. ఐపీఎస్ కొట్టాడిలా.. కానీ

కుటుంబ నేప‌థ్యం : 

Divyanshu Nigam IAS Officer Family

దివ్యాన్షు నిగమ్.. తండ్రి శ్యామ్ కుమార్ నిగమ్. ఈయ‌న‌ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగం చేసే వారు. ఈత‌ని చిన్నతనం నుంచి ఇంట్లో చదువుకునే వాతావరణం ఉండేది. ఈత‌ని కుటుంబం క్రమశిక్షణకు ఎక్కువ‌ ప్రాధాన్యత ఇచ్చింది.

➤☛ Sadaf Choudhary IAS Success Story : ఆ కట్టుబాట్లను చెరిపేసి.. అనుకున్న‌ట్టే క‌లెక్ట‌ర్ ఉద్యోగం సాధించానిలా.. చివ‌రికి..

ఎడ్యుకేష‌న్ : 
దివ్యాన్షు నిగమ్.. గోవాలోని బిట్స్ పిలానీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్‌లో గ్యాడ్యుయేట్ పూర్తి చేశాడు. 

యూపీఎస్సీ సివిల్స్‌కు ప్రిప‌రేష‌న్ ఇలా..

Divyanshu Nigam IAS Officer Story in Telugu

దివ్యాన్షు నిగమ్.. యూపీఎస్సీ (UPSC) సివిల్స్‌ మొదటి ప్రయత్నంలో ప్రిలిమినరీ పరీక్షలో విజయం సాధించలేదు. రెండవ ప్రయత్నంలో మాత్రం మెయిన్స్‌ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.. కానీ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాడు. అలాగే ప‌ట్టు వ‌ద‌లకుండా.. మూడవ ప్రయత్నంలో అనుకున్న‌ట్టే.. జాతీయ స్థాయిలో 44వ ర్యాంక్ సాధించి అంద‌రిని ఆశ్చ‌ర్యప‌రిచాడు.

☛ IAS Officer Success Story : ఫ‌స్ట్ అటెంప్ట్‌లోనే ఐఏఎస్ .. ప్ర‌స‌వించిన 14 రోజుల‌కే పసిబిడ్డతో.. ఆఫీస్‌కు..


కరోనాతో తండ్రి మ‌ర‌ణం.. మ‌రో వైపు..
కరోనా.. రెండవ వేవ్ సమయంలో దివ్యాంశు నిగమ్ ఇంటర్వ్యూ కోసం సిద్ధమయ్యే  సమయంలో.. అతని తండ్రి ఆరోగ్యం క్షీణించింది. అతడిని ఆసుపత్రిలో చేర్చారు. కానీ అతని ఆరోగ్యం మెరుగుపడలేదు. దీంతో అత‌ను తండ్రి శ్యామ్ కుమార్ నిగమ్ మరణించారు. ఈ ఘ‌ట‌న దివ్యాంశు నిగమ్‌కు.. భరించలేనిది. 

నా తండ్రి న‌న్ను ఐఏఎస్‌గా చూడ‌లేక‌పోయ్యాడు..
నేను మూడవ ప్రయత్నంలో ఇంటర్వ్యూకి చేరుకున్నప్పుడు.. నా తండ్రి శ్యామ్ కుమార్ నిగమ్ చాలా సంతోషించాడు. కానీ  నా తండ్రి న‌న్ను ఐఏఎస్ అవ్వడాన్ని చూడలేకపోయాడు.

Success Story : సొంతూరికీ వెళ్ల‌కుండా చ‌దివా.. అనుకున్న ప్ర‌భుత్వ ఉద్యోగం కొట్టానిలా..

నా స‌క్సెస్ క్రెడిట్ నా తండ్రికే..
నా స‌క్సెస్ క్రెడిట్.. నా తండ్రి శ్యామ్ కుమార్ నిగమ్‌కే చెందుతుంది. జీవితంలో పుస్తకాలు చాలా నేర్పుతాయని దివ్యాంశు చెప్పారు. నా విజ‌యంలో ఉపాధ్యాయులకు సహకారం చాలా ఉంది.

క్రమశిక్షణతో చదువుకోవాలి.. లేక పోతే..

Divyanshu Nigam IAS Officer Details in Telugu

ఎవ‌రికైన జీవితంలో చదువు ముఖ్యం. మీరు క్రమశిక్షణతో చదువుకోవాలి. ఎవ‌రికైన జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. యూపీఎస్సీ ప్రిప‌రేష‌న్ స‌మ‌యంలో.. మీరు ఎలాంటి నిరాశ చెంద‌కుండా.. మీ ప్రిప‌రేష‌న్ కొన‌సాగించండి. ముందుగా .. మీరు పరీక్షకు ఎందుకు సిద్ధమవుతున్నారో ఆలోచించండి.

➤☛ UPSC Ranker Success Story : ఈ తిరస్కరణే నేను సివిల్స్‌పై న‌డిచేలా చేశాయ్‌.. నా వైకల్యం కారణంగా..

Published date : 01 Apr 2023 06:21PM

Photo Stories