IAS Officer Success Story : ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఐఏఎస్ .. ప్రసవించిన 14 రోజులకే పసిబిడ్డతో.. ఆఫీస్‌కు..
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా ఐఏఎస్ అధికారి సౌమ్య పాండే ప్రసవం అయిన 14 రోజులకే తిరిగి విధుల్లో చేరి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ నేపథ్యంలో ఐఏఎస్ అధికారి సౌమ్య పాండే సక్సెస్ స్టోరీ మీకోసం..
ఎడ్యుకేషన్ :
సౌమ్య పాండే.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ ప్రాంతానికి చెందిన వారు. ఈమె 10వ తరగతిలో 98 శాతం, 12వ తరగతిలో 97.8 శాతం మార్కులు సాధించారు. ఇంజినీరింగ్‌లో గోల్డ్‌మెడలిస్ట్. స్పోర్ట్స్, డ్యాన్స్‌పై ఆసక్తి ఎక్కువ. క్లాసికల్ డ్యాన్స్ కూడా నేర్చుకున్నారు. బాస్కెట్‌బాల్ ప్లేయర్ కూడా. NCC B,C సర్టిఫికేట్లు సాధించారు.
సివిల్స్‌లో ప్రిపరేషన్ ఇలా..
సౌమ్య పాండే.. 2016లో యూపీఎస్‌సీ పరీక్ష రాశారు. 2017లో సివిల్స్ ఫలితాలు వచ్చిన టైమ్‌లో.. తన నంబర్ చెక్ చేస్తున్నారు. అసలు ఆ లిస్ట్‌లో తన పేరు ఉంటుందనే నమ్మకం ఆమెకు లేదు. అందుకే లిస్ట్‌లో కింద నుంచి చెక్ చేస్తున్నారు. తన కళ్లు ఒక్కో నంబర్‌ను చెక్ చేస్తున్నాయి. తన నంబర్ కనిపించట్లేదు. ఒక్కో సెకను అతికష్టం మీద గడుస్తోంది. భారంగా శ్వాస తీసుకుంటున్నారు. అప్పటికే చాలా నంబర్లు చూశారు. అందులో తన నంబర్ లేదు. తను సివిల్స్‌కు సెలక్ట్ కాలేదనే అభిప్రాయానికి వచ్చేశారు.
➤☛ UPSC Ranker Success Story : ఈ తిరస్కరణే నేను సివిల్స్‌పై నడిచేలా చేశాయ్.. నా వైకల్యం కారణంగా..
అయితే లిస్ట్ పైనుంచి చూడమని వాళ్ల అమ్మగారు చెప్పడంతో ఈసారి అలానే చెక్ చేశారు. నాలుగో నంబర్ దగ్గరకు వచ్చేసరికి ఆమె స్టన్ అయ్యారు. అది తన నంబర్. వాళ్ల అమ్మగారు, ఆమె కలిపి మరోసారి క్రాస్‌చెక్ చేశారు. ఆ తర్వాత వీరి ఆనందానికి అవధులు లేవు. ఫస్ట్ అటెంప్ట్‌లో సివిల్స్ సాధించడమే కాకుండా టాప్-5లో ఒకరిగా ఆమె నిలిచారు. తర్వాత కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.
అంకితభావంతో చదివితే కచ్చితంగా సివిల్స్ సాధించొచ్చు అని ఆమె సూచిస్తున్నారు. ప్రిలిమ్స్ ప్రిపరేషన్ బేసిక్స్ నుంచే మొదలుపెట్టాలని, దీనికి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల కంటే మంచి ఎంపిక లేదంటారు.
➤☛ IAS Officer Success Story : నాన్న డ్రైవర్.. కూతురు ఐఏఎస్.. చదవడానికి డబ్బులు లేక..
కరోనా టైమ్లో.. మూడువారాల బిడ్డతో..
2020లో కరోనా ఫస్ట్ వేవ్‌లో దేశమంతా లాక్‌డౌన్ విధించారు. అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. కొన్ని ముఖ్య విభాగాలు మాత్రమే పనిచేశాయి. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఆ సమయంలో మూడువారాల బిడ్డతో ఒక కలెక్టర్ ఆఫీసుకు వచ్చి.. విధులు నిర్వహించారు.
కరోనా టైంలో సౌమ్య ఉత్తరప్రదేశ్‌లోని మోదీనగర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. డెలివరీ అయిన మూడువారాలకే డ్యూటీకి వచ్చేశారు. ఆరునెలలు మెటర్నిటీ లీవ్ తీసుకునే అవకాశం ఉన్నా సరే.. ఆమె పసిబిడ్డతోనే విధులు నిర్వహించారు. ఆ ఫొటో కూడా అప్పట్లో దేశమంతా వైరల్ అయింది. ఫస్ట్ అటెమ్ట్‌లోనే ఐఏఎస్ అయ్యి, మహమ్మారి సమయంలో అంకితభావంతో బాధ్యతలు నిర్వర్తించినందుకు నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ పరిస్థితులలో నా కుటుంబం నాకు..
కోవిడ్–19 సమయంలో సక్రమంగా పనులు చేయడం మనందరి కర్తవ్యం అంటున్న సౌమ్య కరోనా సమయంలో ఎస్‌డీఎం అధికారిగా నియమించబడ్డారు.ఈ విషయం గురించి మాట్లాడుతూ.. గ్రామంలోని మహిళలు గర్భధారణ సమయంలో ఇంటి సంబంధిత పనులన్నీ చేస్తారు. ప్రసవించిన తరువాత ఆ పనులతో పాటు పిల్లల సంరక్షణ కూడా చేస్తారు. అదే విధంగా నా మూడు వారాల శిశువుతో పరిపాలనా పని చేయగలుగుతున్నాను.
ఈ పరిస్థితులలో నా కుటుంబం నాకు మద్దతు ఇచ్చింది. తహసీల్, ఘజియాబాద్ జిల్లా పరిపాలన నాకు ఒక కుటుంబం లాంటిది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఘజియాబాద్‌లో ఎస్‌డిఎమ్ ఆఫీసర్‌గా ఉన్నాను. సెప్టెంబరులో నా ఆపరేషన్ సమయంలో 22 రోజుల సెలవు వచ్చింది. ప్రసవించిన రెండు వారాల తర్వాత నేను తహసీల్‌లో చేరాను.