IAS Officer Radhika Success Story : రాధిక.. ఐఏఎస్.. చరిత్ర సృష్టించింది.. ఈ బలమైన సంకల్పంతోనే..
అలాగే ఈమె యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 18వ ర్యాంక్ సాధించి రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలో యువ ఐఏఎస్ అధికారి రాధిక సక్సెస్ స్టోరీ ఆమె మాటల్లోనే మీకోసం..
ఎడ్యుకేషన్ :
రాధిక ఏడో తరగతి వరకు హిందీ మాధ్యమంలో చదివింది. 1999వ సంవత్సరం నుంచి 2005 వరకు.. సరస్వతీ శిశు మందిర్ 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదివింది. ఆ తర్వాత అలీరాజ్‌పూర్‌లోని డాన్‌బాస్కో స్కూల్‌లో చేర్పించారు. అలాగే 2017లో ఇండోర్‌లోని జీఎస్ఐటీఎస్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.
☛ IAS Officer Success Story : అప్పుచేశా.. ఐఏఎస్ కొట్టా.. కారణం ఇదే..
దేశంలోనే అత్యంత తక్కువ అక్షరాస్యత గల జిల్లా నుంచి వచ్చి..
దేశంలోనే అత్యంత తక్కువ అక్షరాస్యత గల జిల్లా ఏది..? అంటే ఈ ప్రశ్న చాలా మంది.. మధ్యప్రదేశ్ లోని అలిరాజ్ పూర్ జిల్లా అనే చెప్పుతారు. అక్కడ కేవలం 36.10 శాతం మంది మాత్రమే చదువుకున్నారు. ఇలాంటి జిల్లా నుంచి వచ్చిన ఓ యువతి యూపీఎస్సీ 18వ ర్యాంక్ కొట్టి.. ఐఏఎస్ అయింది. అలాగే తొలిసారిగా ఈ జిల్లా నుంచి ఐఏఎస్ ఆమె.
☛ IAS Success Story : జీవితాన్ని ఇలా చూస్తే.. ఏదైనా ఈజీనే.. ఫెయిల్ అయితే..
ఈ ఉద్యోగానికి రాజీనామా చేశా.. ఎందుకంటే..?
రాధిక.. చదువు పూరైన వెంటనే.. ఏడాదిపాటు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసింది. ఈ ఉద్యోగం చేసే సమయంలోనే.. యూపీఎస్సీ సివిల్స్ (UPSC) పరీక్షలో పాల్గొనాలనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనే.. ఒక సంకల్పంగా మారడంతో.., ఈమె 2018 సంవత్సరంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. యూపీఎస్సీ సివిల్స్ పరీక్షకు ప్రిపరేషన్ మొదలుపెట్టింది.
మొదటి ప్రయత్నంలోనే..
రాధిక.. 2019లో మొదటి ప్రయత్నంలోనే.. విజయం సాధించింది. IRPS (ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీసెస్) క్యాడర్ ఉద్యోగం వచ్చింది. అలాగే ఆమె రెండో సారి 2020లో యూపీఎస్సీ పరీక్షలను కూడా రాసింది.
☛ IAS Success Story : ఫెయిల్..ఫెయిల్..ఫెయిల్.. చివరికి ఐఏఎస్ కొట్టానిలా..
నేను ఎదుర్కొన్న సవాళ్లు ఇవే..
యూపీఎస్సీ సాధించడానికి ఆమె రెండు సవాళ్లు ఎదుర్కొన్నారు. తమ గ్రామంలో.. పెద్దగా ఆడపిల్లలు చదువుకోలేదని ఆమె చెప్పారు. అయితే.. తన తల్లి ప్రోత్సాహంతో తాను చిన్న తనం నుంచే కష్టపడి చదివానన్నారు. నా చదువు తర్వాత.. ఉద్యోగం వచ్చినా.. యూపీఎస్సీ కోసం ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే.. తర్వాత మళ్లీ ఉద్యోగం వస్తుందో రాదో అనే కంగారు ఉండేదని.. ఆ సవాలును ఎదుర్కొనడానికి చాలా కష్టపడ్డానని చెప్పారు. దాదాపు రెండేళ్ల పాటు..కష్టపడి తాను యూపీఎస్సీ 18వ ర్యాంకు సాధించానన్నారు.
నా ప్రిపరేషన్‌లో..
యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష కోసం సన్నద్దమౌతున్నప్పుడు.. చాలా సవాళ్లు ఎదురయ్యేవని.. వాటిని ఎదుర్కొనే సమయంలో.. నిరాశ ఎదురయ్యేదన్నారు. వాటిని ఎదుర్కొని నిలపడి అనుకున్నది సాధించానన్నారు.
నా విజయంలో క్రెడిట్ వీరిదే..
తన కుటుంబసభ్యులతో పాటు.. తమ బంధువు శరద్ గుప్తా కూడా.. తన విజయంలో క్రెడిట్ ఇస్తానని రాధిక చెప్పారు. యూపీఎస్సీ గురించి తనకు ఫస్ట్ చెప్పింది ఆయననేనని.. ఆయన సహకారంతోనే తాను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నామని చెప్పారు.
☛➤ IAS Success Story : కూలీనాలీ చేస్తూ చదివాడు.. ఐఏఎస్ సాధించాడు.. కానీ ఈయన పెళ్లి మాత్రం..
నిజాయితీతో కూడిన ప్రిపరేషన్ ఎంతో ముఖ్యం..
యూపీఎస్సీ మాత్రమే కాదు, మీరు ఏ పరీక్ష రాస్తున్నారో.. దానికి నిజాయితీతో కూడిన కృషి అవసరం. దాని నమూనాను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అది రాష్ట్ర పబ్లిక్ కమిషన్ పరీక్ష లేదా ఎన్‌డీఏ (NDA) లేదా ఎస్ఎస్‌సీ (SSC) పరీక్ష అనేది ముఖ్యం కాదు. పరీక్ష డిమాండ్ ఏమిటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
నా సివిల్స్ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు ఇవే..
ప్రశ్న : ఎన్‌డిఏ ద్వారా మహిళలను నియమించారు... ఎన్‌డిఏ ద్వారా మహిళలను నియమించాలా వద్దా అనే దానిపై మీ అభిప్రాయం ఏమిటి?
దేశభక్తికి లింగభేదం లేదు. అది మగ లేదా ఆడ లేదా లింగమార్పిడి, ప్రతి మనిషి దేశభక్తుడు కావచ్చు. ప్రతి వ్యక్తి దేశానికి సేవ చేయగలడు. ఇప్పటి వరకు సాయుధ దళాల్లోకి మహిళలను అనుమతించలేదు. మనం అనుమతి ఇచ్చినప్పుడు, ఇది చాలా మంచి చొరవ అవుతుంది.. ఎందుకంటే చాలా దేశాలు ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్‌లోని మహిళలు సాయుధ దళాల్లో ఉన్నారు. మహిళా సాధికారతకు ఇది చాలా మంచి మార్గం. వారికి కూడా సమాన వాటా లభిస్తుంది.
☛ UPSC Civils Ranker Success Story : విధికే సవాలు విసిరా.. 22 ఏళ్లకే సివిల్స్ కొట్టానిలా..
ప్రశ్న : పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలు ఉన్నప్పుడు మనకు ఎలక్ట్రిక్ వాహనాలు ఎందుకు అవసరం?
ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ చాలా క్లీన్ టెక్నాలజీ. అది వస్తే కాలుష్యం తగ్గుతుంది. వినియోగదారు ఎంచుకోవడానికి మెరుగైన ఎంపికలను పొందుతారు. పర్యావరణానికి కూడా మంచిది. భవిష్యత్తు కోసం దాని పరిధి చాలా మంచి స్కోప్.
ప్రశ్న : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అంటే ఏమిటి..?
మొబైల్ ఫోన్‌ను ఉదాహరణగా చూపుతూ.., మొబైల్ ఫోన్ మన ప్రపంచం మొత్తాన్ని మార్చిందని అన్నారు. మొబైల్ ఫోన్ సహాయంతో వేల కి.మీ దూరంలో కూర్చున్న వ్యక్తితో మాట్లాడగలుగుతాం. అదే సాంకేతికత సహాయంతో, మేము ఎవరికైనా సహాయం అందించగలము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అటువంటి సాంకేతికతలలో ఒకటి. దీన్ని ఉపయోగించి మనం ప్రపంచం నలుమూలల నుంచి వేలి దూరంలో ఉన్న వ్యక్తులను కనెక్ట్ చేయవచ్చు. ఈ విధంగా మన జీవితం కృత్రిమంగా మేధావిగా ఎలా మారుతుందో వివరించారు.
☛➤ IPS Anjali Success Story : అంజలి విశ్వకర్మ.. ఐపీఎస్ సక్సెస్ స్టోరీ.. నా వెనుక ఉన్నది వీళ్లే..
ప్రశ్న : గిరిజన విద్యను ఎలా మెరుగుపరచగలవు?
గిరిజనుల విద్యను హిందీ, ఇంగ్లీషు భాషల్లో రూపొందించే వరకు గిరిజనులు ఆ భాషను ఉపయోగించకపోవడం వల్ల ఇబ్బందులు తప్పవు. గిరిజనుల భాషలో సిలబస్‌ను రూపొందించినప్పుడు, వారి భాషలో, వారి మాండలికంలో వారి ఉపాధ్యాయుల ద్వారా బోధిస్తాం, అప్పుడు అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఇలా చాలా చోట్ల జరుగుతోంది.
➤☛ Inspirational Success Story : నిజంగా.. ఈ కలెక్టర్ స్టోరీ మనకు కన్నీరు పెట్టిస్తోంది..