UPSC NDA & NA I Exam 2025: రాత పరీక్షలో మంచి మార్కులు సాధించాలంటే..
Sakshi Education
నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ.. ఇంటర్మీడియెట్‌తోనే త్రివిధ దళా(ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ)ల్లో పర్మనెంట్ కమిషన్డ్ ర్యాంకు హోదాతో..
కొలువు సొంతం చేసుకునేందుకు చక్కటి మార్గం. కొలువుతోపాటు బీఏ, బీఎస్‌సీ, బీటెక్ డిగ్రీలు పొందే అవకాశం కూడా లభిస్తుంది. వీటిలో ప్రవేశానికి యూపీఎస్‌సీ ప్రతి ఏటా రెండుసార్లు నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ (ఎన్‌డీఏ, ఎన్‌ఏ) ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తుంది. తాజాగా 2025 సంవత్సరానికి సంబంధించి.. ఎన్‌డీఏ,ఎన్‌ఏ(1)–2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో..
రాత పరీక్షలో మంచి మార్కులు సాధించాలంటే..
- పేపర్–1లో మంచి మార్కులు సాధించాలంటే..అల్జీబ్రా, మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్, అనలిటికల్ జామెట్రీ, ఇంటిగ్రల్ కాలిక్యులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వెక్టార్ అల్జీబ్రా, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, ట్రిగ్నోమెట్రీ అంశాలపై పట్టు సాధించాలి. ఇందుకోసం ఇంటర్మీడియెట్ స్థాయి పుస్తకాలను అధ్యయనం చేయాలి. అదే విధంగా ప్రాక్టీస్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లు రాయడం కూడా మేలు చేస్తుంది. బేíసిక్ ప్రిన్సిపుల్స్, వివిధ సిద్ధాంతాలు, సూత్రాలు, ఫార్ములాలపై పట్టు సాధించాలి. ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
- పేపర్–2లో విజయానికి బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్, వొకాబ్యులరీ రీడింగ్ కాంప్రహెన్షన్‌లనై పట్టు సాధించాలి. జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ సైన్స్, చరిత్ర–భారత స్వాతంత్య్రోద్యమం, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్‌లను క్షుణ్నంగా అవగాహన చేసుకోవాలి. పాత ప్రశ్న పత్రాలు, ఆయా విభాగాలకు ఇచ్చిన వెయిటేజీ ఆధారంగా ప్రిపరేషన్ ప్రణాళిక రూపొందించుకోవాలి.
- ఫిజిక్స్‌లో ఎలక్ట్రోమాగ్నటిజం, మెకానిక్స్, డైనమిక్స్‌లోని అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కెమిస్ట్రీలో కెమికల్ అనాలసిస్, ఇనార్గానిక్ కాంపౌండ్స్, పిరియాడిక్ టేబుల్స్, కాన్సెప్ట్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ, ఈక్విలిబ్రియమ్, థర్మోడైనమిక్స్, క్వాంటమ్ మెకానిక్స్‌పై ప్రధానంగా దృష్టి సారించాలి.
- జనరల్ సైన్స్‌లో వ్యాధులు–కారకాలు, ప్లాంట్ అనాటమీ, మార్ఫాలజీ, యానిమల్ కింగ్ డమ్‌లపై అవగాహన ఏర్పరచుకోవాలి. కరెంట్ అఫైర్స్ కోసం పరీక్ష జరిగే తేదీకి ముందు ఆరు నెలల వ్యవధిలో జరిగిన సమకాలీన మార్పులపై దృష్టి సారించాలి.
- హిస్టరీ విభాగాలకు సంబంధించి స్వాతంత్రోద్యమ సంఘటనలు, రాజులు–రాజ్య వంశాలు, చారిత్రక కట్టడాలు, యుద్ధాల సంబంధిత అంశాలను అధ్యయనం చేయాలి. భౌగోళిక శాస్త్రానికి సంబంధించి ప్రకృతి వనరులు, విపత్తులు, నదులు, పర్వతాలు, పర్యావరణం వంటి అంశాల్లో పట్టు సాధించడం మేలు చేస్తుంది.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 17 Dec 2024 05:23PM