Skip to main content

UPSC Civils Mains Results 2024 Released :యూపీఎస్సీ సివిల్స్‌ మెయిన్స్‌ ఫలితాలు విడుదల

UPSC Civil Services Mains Exam Results 2024   UPSC Civil Services Mains Exam 2024 Qualified Candidates List UPSC Civils Mains Results 2024 Released :యూపీఎస్సీ సివిల్స్‌ మెయిన్స్‌ ఫలితాలు విడుదల

న్యూఢిల్లీ: అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం విడుదల చేసింది. మెయిన్స్‌ పరీక్ష రాసిన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థుల హాల్‌టికెట్‌ నంబర్లతో జాబితాను విడుదల చేసింది. 

కాగా ఈ ఏడాది మొత్తం 1056 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు యూపీఎస్సీ గతంలో నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్‌ 16న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించి జులై 1న ఫలితాలు వెల్లడించారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్‌ 20 నుంచి 29 వరకు మెయిన్‌ పరీక్షలు నిర్వహించారు. 

ఈ ఫలితాలను యూపీఎస్సీ తాజాగా విడుదల చేసింది.  త్వరలో  న్యూ ఢిల్లీలోని షాజహాన్ రోడ్‌లోని ధోల్‌పూర్ హౌస్‌లో ఉన్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఈ ఇంటర్వ్యూలో  ఎంపికైన వారిని ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐపీఎస్‌, ఇతర కేంద్ర సర్వీసులకు ఎంపిక చేస్తారు.

ఇదీ చదవండి: UPSC: Civil Services (Main)Exam 2024 History Paper - I Question Paper

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 10 Dec 2024 11:35AM
PDF

Photo Stories