Skip to main content

UPSC Civil Services Mains 2022 Result : సివిల్ సర్వీసెస్ మెయిన్స్‌ 2022 ఫలితాలు విడుద‌ల‌.. ఎంత మంది అర్హ‌త సాధించారంటే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ మెయిన్స్‌-2022 ఫలితాలను డిసెంబ‌ర్ 6వ తేదీన‌(మంగ‌ళ‌వారం) విడుద‌ల చేశారు.
UPSC
UPSC Civil Services Mains 2022 Result Released

ఈ మేర‌కు యూపీఎస్సీ ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. సెప్టెంబ‌ర్ 16వ తేదీ నుంచి 25వ తేదీ వ‌ర‌కు సివిల్ సర్వీసెస్ మెయిన్స్‌-2022 ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌న విష‌యం తెల్సిందే.

UPSC Civil Services Mains Exam 2022 Results: How to check
Step 1 : Visit the official website — upsc.gov.in
Step 2 : Click on the result link.
Step 3 : In the result PDF, check your roll number.
Step 4 : Download the PDF and take a print out for future reference

మెయిన్ పరీక్ష-2022 అర్హత సాధించిన వారు.. 
సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష-2022 అర్హత సాధించిన వారికి యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ upsc.gov.in లో డీటైల్డ్‌ అప్లికేషన్‌ ఫాం-2 (డీఏఎఫ్‌-II) అందుబాటులో ఉంటుందని, నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేసుకోవల్సి ఉంటుందని సూచించింది.

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ నియామక ప్రక్రియ ఇలా.. 
మెయిన్స్‌ రాత పరీక్షల అనంతరం పర్సనల్ టెస్ట్‌/ఇంటర్వ్యూ జరుగుతుంది. దీనికి హాజరయ్యే వారు తప్పనిసరిగా డీఏఎఫ్‌-II అప్లికేషన్‌ను పూరించవలసి ఉంటుంది. లేదంటే ఇంటర్వ్యూకి అనుమతింపబడరు. మెయిన్స్‌లో అర్హత సాధించిన వారు మెట్రిక్యులేషన్, హయ్యర్ సెకండరీ, డిగ్రీ, ఇతర అన్ని ఓరిజినల్‌ డాక్యుమెంట్లతోపాటు, ఫొటోకాఫీలను కూడా సిద్ధం చేసుకోవల్సిందిగా యూపీఎస్సీ తెలియజేస్తూ ప్రకటన జారీ చేసింది. యూపీఎస్సీ త్వ‌ర‌లోనే ఇంటర్వ్యూ తేదీలు ప్ర‌క‌టించ‌నున్న‌ది.

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్‌-2022 అర్హత సాధించిన వారు వీరే..

Published date : 06 Dec 2022 06:27PM
PDF

Photo Stories