Skip to main content

NDA and NA(2) Notification: ఎన్‌డీఏ, ఎన్‌ఏ(2) నోటిఫికేషన్‌ విడుద‌ల‌.. ఈ అర్హతతో దరఖాస్తుల‌కు అవకాశం!

త్రివిధ దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ల్లో చేరితే.. సమాజంలో గౌరవంతోపాటు దేశ సేవ చేస్తున్నామనే సంతృప్తి!!అంతేకాకుండా ఆకర్షణీయ వేతనం, ఉజ్వల కెరీర్‌ అవకాశాలు అందుకోవచ్చు. అందుకే త్రివిధ దళాల్లో కొలువు కోరుకునే వారి సంఖ్య పెరుగుతోంది..
NDA, NA Exam Selection Process  NDA, NA Exam Preparation Tips NDA, NA Exam Syllabus NDA NA 2 2024 Notification Notification for National Defense Academy and Naval Academy entrance exam 2024

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ఇంటర్మీడియెట్‌ అర్హతతోనే త్రివిధ దళాల్లో ఉద్యోగంతోపాటు ఉన్నత విద్యకు మార్గం.. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ), నేవల్‌ అకాడమీ  (ఎన్‌ఏ) ఎగ్జామినేషన్‌!! తాజాగా.. యూపీఎస్సీ ఎన్‌డీఏ, ఎన్‌ఏ(2)–2024 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఎన్‌డీఏ, ఎన్‌ఏ పరీక్ష వివరాలు, ఎంపిక ప్రక్రియ, సిలబస్‌ అంశాలు, ప్రిపరేషన్‌ తదితర వివరాలు.. 

నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, నేవల్‌ అకాడమీలలో యువతకు అవకాశం కల్పించే ఎన్‌డీఏ, ఎన్‌ఏ పరీక్షను యూపీఎస్సీ ప్రతి ఏటా రెండుసార్లు నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో విజయం సాధించి మలిదశలో మిలటరీ అకాడమీ, నేవల్‌ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలు వేర్వేరుగా నిర్వహించే ఎస్‌ఎస్‌బీ ఎంపిక ప్రక్రియలోనూ నెగ్గి తుది విజేతలుగా నిలిస్తే.. అభ్యర్థులు ఎంచుకున్న విభాగంలో పర్మనెంట్‌ కమిషన్డ్‌ ర్యాంకు హోదాతో కొలువుదీరొచ్చు.

CIPET Admissions: ‘సిపెట్‌’ కోర్సులకు దరఖాస్తు గడువు తేదీ ఇదే..

మొత్తం 404 పోస్ట్‌లు
యూపీఎస్సీ ఎన్‌డీఏ, ఎన్‌ఏ(2)–2024 ఎగ్జామ్‌ ద్వారా నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, నేవల్‌ అకాడమీలకు సంబంధించి మొత్తం 404 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలోని పోస్ట్‌లలో భాగంగానే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లకు వేర్వేరుగా ఖాళీలను ప్రకటించారు. ఆర్మీలో 208 పోస్టులు, నేవీలో 42 పోస్టులు, ఎయిర్‌ఫోర్స్‌ (ఫ్లయింగ్‌ విభాగం)–92 పోస్టులు, ఎయిర్‌ఫోర్స్‌ గ్రౌండ్‌ డ్యూటీస్‌(టెక్నికల్‌)–18 పోస్టులు, ఎయిర్‌ఫోర్స్‌గ్రౌండ్‌ డ్యూటీ (నాన్‌ టెక్నికల్‌)–10 పోస్టులు, నేవల్‌ అకాడమీ (10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌)లో 34 పోస్టులు ఉన్నాయి. 

 •     ఆర్మీలో 10, నేవీలో 6, ఎయిర్‌ఫోర్స్‌లోని మూడు విభాగాల్లో రెండు చొప్పున 6 పోస్ట్‌లు, 10+2 క్యాడెట్‌ ఎంట్రీలో 5 పోస్ట్‌లను మహిళలకు కేటాయించారు.

To Lam: వియత్నాం కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన టో లామ్‌

అర్హతలు

 •     ఆర్మీ వింగ్‌: ఏదైనా గ్రూప్‌లో ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత ఉండాలి. 
 •     ఎయిర్‌ఫోర్స్, నేవీ, నేవల్‌ అకాడమీ: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లుగా ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులవ్వాలి. ద్వితీయ సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు 2025 జూన్‌ 24వ తేదీ నాటికి సర్టిఫికెట్లు అందించాల్సి ఉంటుంది. 
 •     వయసు: జనవరి 2, 2006–జనవరి 1, 2009 మధ్యలో జన్మించి ఉండాలి.

రెండు దశల ఎంపిక
ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. అవి.. రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ ఎంపిక ప్రక్రియ. తొలి దశలో యూపీఎస్సీ ఎన్‌డీఏ, ఎన్‌ఏ రాత పరీక్షను నిర్వహిస్తుంది. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులు దరఖాస్తు సమయంలో పేర్కొన్న ప్రాథమ్యాలను పరిగణనలోకి తీసుకుని మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. ఈ జాబితాలో చోటు సాధించిన వారికి తదుపరి దశలో సదరు విభాగాల్లో (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌) ఎస్‌ఎస్‌బీల ఆధ్వర్యంలో ప్రత్యేక పరీక్షలు ఉంటాయి. 

Dr Gayathri: స్విమ్స్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు ఫెలోషిప్‌ అవార్డు

శిక్షణ, డిగ్రీ సర్టిఫికెట్‌
ఎంపిక ప్రక్రియ రెండు దశల్లోనూ విజయం సాధించి.. తుది జాబితాలో నిలిచిన అభ్యర్థులకు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, నేవల్‌ అకాడమీల్లో శిక్షణనిస్తారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ విభాగాలకు సంబంధించి నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ పుణెలో, నేవల్‌ అకాడమీ అభ్యర్థులకు ఎజిమలలోని నేవల్‌ అకాడమీలో శిక్షణ ఉంటుంది. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి బీఏ, బీఎస్సీ, బీటెక్‌ పట్టాలు కూడా అందజేస్తారు. అంటే.. ఒకే సమయంలో కొలువు, ఉన్నత విద్య రెండింటినీ సొంతం చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది.

10+2 క్యాడెట్‌ ఎంట్రీ.. ప్రత్యేక శిక్షణ
ఎన్‌ఏ, 10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌కు ఎంపికైన వారికి నేవల్‌ అకాడమీ(ఎజిమల)లో నాలుగేళ్లపాటు ప్రత్యేకంగా శిక్షణనిస్తారు. ఆ తర్వాత వీరికి అప్లైడ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, నేవల్‌ ఆర్కిటెక్చర్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ బ్రాంచ్‌లలో ఏదో ఒక బ్రాంచ్‌తో బీటెక్‌ సర్టిఫికెట్‌ అందిస్తారు.

Indian Air Force jobs: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు

స్టయిఫండ్‌
ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించి ఆయా అకాడమీల్లో ప్రవేశం ఖరారు చేసుకున్న వారికి ఆర్థిక ప్రోత్సాహకం కూడా లభిస్తుంది. అకాడమీలలో శిక్షణ సమయంలోనే నెలకు రూ.­56,100 స్టైపెండ్‌గా అందిస్తారు. ఆ తర్వాత ఫీల్డ్‌ ట్రైనింగ్‌ కూడా పూర్తి చేసుకుంటే.. రూ.56,100–రూ.1,77,500 వేతన శ్రేణితో కెరీర్‌ ప్రారంభం అవుతుంది. ప్రారంభంలో ఆర్మీ విభాగంలో లెఫ్ట్‌నెంట్, నేవీ విభాగంలో సబ్‌ లెఫ్ట్‌నెంట్, ఎయిర్‌ఫోర్స్‌ విభాగంలో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ కేడర్‌తో కెరీర్‌ ప్రారంభమవుతుంది.

ముఖ్య సమాచారం

 •     దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
 •     ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2024, జూన్‌ 4
 •     ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ అవకాశం: జూన్‌ 5 నుంచి 11 వరకు
 •     ఎన్‌డీఏ, ఎన్‌ఏ పరీక్ష తేదీ: 2024, సెప్టెంబర్‌ 1
 •     పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.upsc.gov.in

 May 27th Holiday : మే 27వ తేదీన‌ సెల‌వు.. ఎందుకంటే..?

రాత పరీక్ష ఇలా
ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎంపిక ప్రక్రియలో తొలి దశ రాత పరీక్షను రెండు పేపర్లలో మొత్తం 900 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతో జరుగుతుంది. ఇందులో పేపర్‌–1 మ్యాథమెటిక్స్‌ 300 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు. అదేవిధంగా పేపర్‌ 2లో జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌ 600 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు. పేపర్‌–2లో పార్ట్‌–ఎ ఇంగ్లిష్‌ 200 మార్కులకు, అదేవిధంగా పార్ట్‌–బి జనరల్‌ నాలెడ్జ్‌ 400 మార్కులకు ఉంటాయి.

పార్ట్‌–బిలో ఆరు విభాగాలు
పేపర్‌–2లోని పార్ట్‌–బిలో ఆరు విభాగాలు.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్‌ సైన్స్, హిస్టరీ, భారత స్వాతంత్య్రోద్యమం; జాగ్రఫీ; కరెంట్‌ ఈవెంట్స్‌ నుంచి ప్రశ్నలడుగుతారు. ప్రతి విభాగానికి సంబంధించి నిర్దిష్టంగా వెయిటేజీని పేర్కొన్నారు. ఫిజిక్స్‌కు 25 శాతం, కెమిస్ట్రీకి 15 శాతం, జనరల్‌ సైన్స్‌కు 10 శాతం, హిస్టరీ, భారత స్వాతంత్య్రోద్యమానికి 20 శాతం, జాగ్రఫీకి 20 శాతం, కరెంట్‌ ఈవెంట్స్‌కు 10 శాతం వెయిటేజీ కల్పించారు. ఈ వెయిటేజీ ప్రకారమే ఆయా విభాగాల్లో ప్రశ్నల సంఖ్య, మార్కులు ఉంటాయి.

Diploma in Pharmacy Courses: డీఫార్మసీ కోర్సులో ప్రవేశాలు

ఎస్‌ఎస్‌బీ ఎంపిక ప్రక్రియ

 •     రాత పరీక్షలో విజయం సాధించి మెరిట్‌ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు మలి దశలో 900 మార్కులకు ఎస్‌ఎస్‌బీ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న సమయంలో పేర్కొన్న ప్రాథమ్యతలు, రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా ఎస్‌ఎస్‌బీ (సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డ్‌) ఇంటెలిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్ట్‌ నిర్వహిస్తుంది. ఎయిర్‌ఫోర్స్‌ విభాగాన్ని ప్రాథమ్యంగా ఎంపిక చేసుకున్న అభ్యర్థులు ఎస్‌ఎస్‌బీ తర్వాత నిర్వహించే కంప్యూటరైజ్డ్‌ పైలట్‌ సెలక్షన్‌ సిస్టమ్‌లో కూడా విజయం సాధించాల్సి ఉంటుంది. 
 •     ఎస్‌ఎస్‌బీ ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల్లో మానసిక, శారీరక ద్రుఢత్వాన్ని పరిశీలిస్తా­రు. ఇంటెలిజెన్స్‌ టెస్ట్, వెర్బల్‌ టెస్ట్, నాన్‌ వెర్బ­ల్‌ టెస్ట్, సామాజిక అంశాలపై ఉన్న అవగాహ­న, తార్కిక విశ్లేషణ సామర్థ్యాలను పరీక్షిస్తారు. అదే విధంగా పిక్చర్‌ పర్సెప్షన్‌ అండ్‌ డిస్క్రిప్టన్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇలా మొత్తం అయిదు రోజుల పాటు ఈ ప్రక్రియ సాగుతుంది. ఇందులోనూ తుది జాబితాలో నిలిచిన వారికి ప్రాథమికంగా నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ–పుణె, నేవల్‌ అకాడమీ (ఎజిమల)లో శిక్షణ ఇస్తారు.


రాత పరీక్షలో సక్సెస్‌కు మార్గం

 •     పేపర్‌–1లో మంచి మార్కులు సాధించాలంటే.. అల్జీబ్రా, మ్యాట్రిక్స్‌ అండ్‌ డిటర్మినెంట్స్, అనలిటికల్‌ జామెట్రీ, ఇంటిగ్రల్‌ కాలిక్యులస్, డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్, వెక్టార్‌ అల్జీబ్రా, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, ట్రిగ్నోమెట్రీ అంశాలపై పట్టు సాధించాలి. ఇందుకోసం ఇంటర్మీడియెట్‌ స్థాయి పుస్తకాలను అధ్యయనం చేయాలి. 
 •     పేపర్‌–2లో రాణించేందుకు బేసిక్‌ ఇంగ్లిష్‌ గ్రామర్, వొకాబ్యులరీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌లపై పట్టు సాధించాలి. జనరల్‌ నాలెడ్జ్‌కు సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్‌ సైన్స్, చరిత్ర–భారత స్వాతంత్య్రోద్యమం, జాగ్రఫీ, కరంట్‌ అఫైర్స్‌లను క్షుణ్నంగా అవగాహన చేసుకోవాలి. పాత ప్రశ్న పత్రాలు, ఆయా విభాగాలకు ఇచ్చిన వెయిటేజీ ఆధారంగా ప్రిపరేషన్‌ ప్రణాళిక రూపొందించుకోవాలి.
 •     ఫిజిక్స్‌లో.. ఎలక్ట్రోమాగ్నటిజం, మెకానిక్స్, డైనమిక్స్‌లోని అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. 

  Job Opportunity: యువతకు ఉద్యోగ అవకాశాలు
   
 •     కెమిస్ట్రీలో.. కెమికల్‌ అనాలసిస్, ఇనార్గానిక్‌ కాంపౌండ్స్, పిరియాడిక్‌ టేబుల్స్, కాన్సెప్ట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ కెమిస్ట్రీ, ఈక్విలిబ్రియమ్, థర్మోడైనమిక్స్, క్వాంటమ్‌ మెకానిక్స్‌పై ప్రధానంగా దృష్టి సారించాలి. 
 •     జనరల్‌ సైన్స్‌లో.. వ్యాధులు–కారకాలు, ప్లాంట్‌ అనాటమీ, మార్ఫాలజీ, యానిమల్‌ కింగ్‌ డమ్‌లపై అవగాహన పెంచుకోవాలి.
 •     కరెంట్‌ అఫైర్స్‌ కోసం పరీక్ష తేదీకి ముందు ఆరు నెలల వ్యవధిలో జరిగిన సమకాలీన పరిణామాలపై దృష్టి సారించాలి. 
 •     హిస్టరీకి సంబంధించి రాజులు–రాజ వంశాలు, చారిత్రక కట్టడాలు, స్వాతంత్రోద్యమ సంఘటనలు తదితర అంశాలను అధ్యయనం చేయాలి.
 •     భౌగోళిక శాస్త్రానికి సంబంధించి ప్రకృతి వనరులు, విపత్తులు, నదులు, పర్వతాలు, పర్యావరణం వంటి అంశాల్లో పట్టు సాధించడం మేలు చేస్తుంది.  

 PG Diploma Courses: షుగర్‌ టెక్నాలజీలో పీజీ డిప్లొమా కోర్సులు.. ద‌రఖాస్తుల‌కు చివ‌రి తేదీ..!

Published date : 24 May 2024 11:25AM

Photo Stories