UPSCని సందర్శించిన TGPSC బృందం.. ఇకపై ఇలా..

పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన, నియామకాల ప్రక్రియ, కోర్టు కేసులు తదితర అంశాలపై యూపీఎస్సీ అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసేందుకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం, సభ్యులు అనితా రాజేంద్ర, అమిరుల్లా ఖాన్, నర్రి యాదయ్య, రామ్మోహన్‌రావు, రజని కుమారి తదితరుల బృందం ఢిల్లీ చేరుకుంది.
ఇందులో భాగంగా డిసెంబర్ 18న యూపీఎస్సీ చైర్‌పర్సన్ ప్రీతిసూదన్‌తో బృందం సభ్యులు సమావేశమయ్యారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
నియామక పరీక్షలను సజావుగా నిర్వహించడంలో యూపీఎస్సీ అనుసరిస్తున్న విధానాలు, నియామక ప్రక్రియలు, కేసుల నిర్వహణలో పాటించాల్సిన విధానాలు, కమిషన్‌కు ఇచ్చిన ఆర్థిక స్వయంప్రతిపత్తి తదితర అంశాలను తెలుసుకున్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
యూపీఎస్సీ, టీజీపీఎస్సీ అనుసరిస్తున్న విధానాలపైనా చర్చించారు. నియామకాల ప్రక్రియను విజయవంతం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. టీజీపీఎస్సీ ఈ ఏడాది 13 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసిందని ఈ సందర్భంగా చైర్మన్ బుర్రా వెంకటేశం వివరించారు.