Gurukul Student : పైలెట్ శిక్షణకు ఎంపికైన గురుకుల విద్యార్థి.. సీఎం కార్యాలయంలో..
సాక్షి ఎడ్యుకేషన్: ప్రతీ మనిషి కలలు కంటారు. దానికి తగ్గ కష్టం, పట్టుదల ఉన్నవారి కలలు ఖచ్చితంగా సాకారం అవుతాయి. వారు చిన్న అయినా, పెద్ద అయినా.. కృషి, పట్టుదల ఉన్నప్పుడు ఎంత చిన్న స్థాయిలో ఉన్నవారైనా నెగ్గి ఉన్నత స్థాయిలోనే నిలబడతారు.
అటువంటి ఒక కథే ఈ యువకునిది కూడా.. గురుకులంలో చదివిన ఈ యువకుడు నేడు ఎంతో గర్వించే స్థాయిలో నిలిచి, అందరికీ స్పూర్తిదాయకునిగా నిలబడ్డాడు. అతను ఎవరో.. తన కథేంటో.. అసలేం కల గన్నాడు..? ఎలా గెలిచాడు..? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం..
దేశరక్షణలో భాగమే లక్ష్యంగా
నిరుపేద కుటుంబంలో పుట్టిన యువకుడు కరీంనగరంలోని చొప్పదండి మండలంలోని గుమ్లాపూర్‌కు చెందిన గురుకుల విద్యార్థి సిద్ధార్థ.. తన తల్లి జమున, తండ్రి మల్లయ్య. వ్యవసాయం చేస్తూ తమ కొడుకుని చదివించుకున్నారు ఈ దంపతులు. పదోతరగతి వరకు రుక్మాపూర్ ఆదర్శ పాఠశాలలో చదివుకున్నాడు సిద్ధార్థ్.
అయితే, దేశరక్షణలో పాలుపంచుకోవాలన్న ఆశయంతో తను ఇంటర్మీడియట్‌లో రుక్మాపూర్ సైనిక పాఠశాలలో చేరి రెండేళ్లపాటు శిక్షణ తీసుకున్నాడు. అనంతరం, ఎస్ఎస్‌బీ పరీక్షలో భాగంగా జాతీయ స్థాయిలో 7 లక్షల మంది రాస్తే, చివరకు 612 మంది సెలక్ట్ అయ్యారు. ఈ సంఖ్యలో సిద్ధార్థ్ కూడా ఒకడు. అనంతరం, నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో సర్వీస్ సెలెక్షన్ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) నిర్వహించిన అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి చివరిగా పైలట్ శిక్షణకు ఎంపికయ్యాడు సిద్ధార్థ్.
సీఎం ప్రశంసలు..
సిద్ధార్థ్ దక్కించుకున్న విజయం తెలుసుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన కార్యాలయానికి ఆహ్వానించి సత్కరించారు. అంతేకాకుండా, రూ. 10 వేల చెక్కను ఇచ్చారు. సిద్ధార్థ్‌లోపాటు ఇతర విద్యార్థులు వివిధ రంగాల్లోకి వెళ్లినవారు, ఇతర కలలను సాకారం చేసుకుంటున్నావారిని కూడా సత్కరించారు సీఎం.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
గురుకులంలో శిక్షణ..
రుక్మాపూర్ గురుకుల పాఠశాలలో సుమారు 560 మంది విద్యార్ధులకు విశ్రాంత సైనిక అధికారులతో ఇస్తున్న శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ చదువుతున్న విద్యార్ధులు చదువుతోపాటు క్రీడలు, ఉద్యోగ రంగాల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్నారు. ఉదయం 5 గంటల నుంచే వారి దినచర్య ప్రారంభమవుతుంది.
Success Story : నాలుగు Govt Jobs సాధించానిలా.. . DAOలో నెగ్గాలంటే ఈ వ్యూహాలు తప్పని సరి..
దేశరక్షణలో భాగస్వాములు కావాలనే కలలను నెరవేర్చుకునేందుకు ఏటా యూపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) పరీక్ష వీరంతా రాస్తున్నారు. ఇలా ఐదేళ్లలో 30 మందికి పైగా విద్యార్థులు NDAలో ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. ఇందులో గతంలో ఇద్దరు తుది దశకు ఎంపిక కాగా ఒకరు వైద్య పరీక్షలో విఫలం అయ్యారు. మరొకరు విజయం సాధించారు. అదే సిద్ధార్ధకు దక్కిన విజయం. నాలుగేళ్ల శిక్షణ అనంతరం విధుల్లో చేరనున్నాడు.
Tags
- Success Story
- success and inspiring stories of young talents
- Gurukul students
- gurukul students success stoires
- pilot training candidates
- NDA Exams
- UPSC Candidates Success stories
- National Defense Academy
- Pilot training
- gurukul students to pilot trainees
- Telangana CM
- Revanth Reddy
- telangan gurukul students
- Rukmapur Gurukul School
- pilots success stories
- latest success and inspiring stories in telugu
- NDA in UPSC
- National level exams
- gurukul students felicitation
- Education News
- Sakshi Education News
- latest success news
- students success news latest
- telangana gurukul students success news
- telangana students success stories latest