UPSC NDA & NA -II Notification 2024 : ఇంటర్ అర్హతతోనే.. 404 ఉన్నతస్థాయి ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
దీని ద్వారా త్రివిధ దళాల విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. జూలై–2025 నుంచి ప్రారంభమయ్యే 154వ కోర్సులో, 116వ ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఎసీ) కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు.
ఖాళీల వివరాలు ఇవే.. :
NDA : 370
NA : 34
అర్హతలు ఇవే :
ఆర్మీ వింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఏదైనా గ్రూపులో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్ ఫోర్స్, నేవీ పోస్టులకు 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నేవల్ అకాడమీ) ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయోపరిమితి ఇలా.. :
అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు 02 జనవరి 2006 నుంచి 1 జనవరి 2009 మధ్య జన్మించాలి.
ఎంపిక విధానం ఇలా :
రాత పరీక్ష, ఇంటెలిజెన్స్- పర్సనాలిటీ టెస్ట్, ఎస్ఎస్బీ టెస్ట్/ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టు తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
రాతపరీక్ష, ఇంటర్వ్యూ విధానం :
☛ మొత్తం 900 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. మొత్తం రెండు పేపర్లుంటాయి.
☛ పేపర్-1(మ్యాథమెటిక్స్)కు 300 మార్కులు, పేపర్-2(జనరల్ ఎబిలిటీ టెస్ట్)కు 600 మార్కులు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 నిమిషాలు కేటాయించారు.
☛ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి.
☛ రాతపరీక్షలో ఎంపికైనవారికి ఇంటర్వ్యూ/ఎస్‌ఎస్‌బీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకు 900 మార్కులు కేటాయించారు.
☛ రాతపరీక్షలో అర్హత సాధించినవారికి ఇంటెలిజెన్స్ & పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ రేటింగ్, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్ర్కిప్షన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టులు, గ్రూప్ డిస్కషన్ తదితర టాస్కులు నిర్వహిస్తారు. రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ నిర్వహించిన ఇంటర్వ్యూలో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపికలు జరుగుతాయి.
దరఖాస్తు ఫీజు :
రూ. 100/- (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ విధానం ద్వారా
దరఖాస్తు గడువు : 2024 జూన్ 4వ తేదీ వరకు
శిక్షణ :
అర్హత సాధించిన అభ్యర్థులు నేషనల్ డిఫెన్స్ అకాడమీ, పుణెలో చదువు, శిక్షణ పొందుతారు. అనంతరం ఆర్మీ క్యాడెట్లను డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీకి.. నేవల్ క్యాడెట్లను ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీకి.. ఎయిర్ ఫోర్స్ క్యాడెట్లను హైదరాబాద్‌లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధిత ట్రేడ్ శిక్షణ కోసం పంపుతారు. అభ్యర్థి ఎంపికైన విభాగాన్ని బట్టి ఈ శిక్షణ ఏడాది నుంచి 18 నెలల వరకు ఉంటుంది. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ప్రారంభ స్థాయి ఆఫీసర్ ఉద్యోగాలైన లెఫ్టినెంట్, సబ్-లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్/గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాతో కెరియర్ ప్రారంభం అవుతుంది.
ముఖ్యమైన తేదీలు ఇవే :
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: మే 15, 2024
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది : జూన్ 4, 2024
దరఖాస్తుల సవరణ తేదీలు: జూన్ 5 నుంచి 11 వరకు
పరీక్ష తేదీ : సెప్టెంబర్ 1, 2024
కోర్సులు ప్రారంభం : జులై 2, 2025
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు :
అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్.
404 ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ & సిలబస్ ఇదే..
Tags
- upsc nda and na recruitment 2024
- upsc nda 2024 notification
- upsc na notification 2024
- UPSC NDA and NA Exam 2024 Syllabus
- UPSC NDA NA Exam Pattern Syllabus
- upsc na exam pattern 2024
- UPSC NDA and NA Exam 2024
- UPSC NDA and NA Exam 2024 Details in Telugu
- upsc nda and na exam 2024 syllabus
- upsc nda and na exam 2024 syllabus in telugu
- nda syllabus 2024
- UPSC jobs
- UPSC Notification
- UPSC Exams
- UPSC Recruitment
- upsc nda and na exam 2024 notification
- upsc nda and na exam 2024 notification details in telugu
- Union Public Service Commission
- Union Public Service Commission NDA 2024
- Union Public Service Commission NDA 2024 Question Paper
- UPSC NDA and NA II notification 2024 released
- UPSC NDA and NA II notification 2024 released news in telugu
- UPSC 404 posts NDA and NA II notification 2024 released
- upsc 404 posts nda and na eligibility 2024
- upsc 404 posts nda and na age limit
- upsc 404 posts nda and na apply last date
- upsc 404 posts nda and na selection process